Skin Crack : చలికాలంలో చర్మం పగలటానికి అస్సలు కారణాలు ఇవే… అవేమిటో తెలుసా…??
ప్రధానాంశాలు:
Skin Crack : చలికాలంలో చర్మం పగలటానికి అస్సలు కారణాలు ఇవే... అవేమిటో తెలుసా...??
Skin Crack : చలి అనేది రోజురోజుకి పంజా విసురుతుంది. అలాగే రోజురోజుకి చలి అనేది బాగా పెరిగిపోతుంది. అలాగే సాయంత్రం ఐదు గంటలకే చీకటి కూడా పడుతుంది. ఇది ఇలా ఉండగా చలికాలం రాగానే మొదటగా వచ్చే సమస్యలలో చర్మ పొడిబారడం కూడా ఒకటి. ఈ సీజన్ లో చర్మం అనేది పొడిబారి మెరుపును కోల్పోతుంది. ఈ కాలంలో పెదవులు మొదలుకొని కాళ్లు మరియు ముఖం, చేతులు అనేవి బాగా పగిలిపోతూ ఉంటాయి. దీంతో మాయిశ్చరైజర్ మరియు కొబ్బరి నూనెను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే చలికాలం రాగానే చర్మం అనేది ఎందుకు పగులుతుందో తెలుసా… ఈ చలికాలానికి మరియు చర్మం పగిలిపోవడానికి అస్సలు సంబంధం ఏమిటి.? ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం…??
ఈ సీజన్ లో వాతావరణం అనేది ఒక్కసారిగా చల్లగా మారిపోతుంది. అలాగే చలి గాలుల తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం లో తేమ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ కారణం చేత చర్మం అనేది పగిలిపోతూ ఉంటుంది. అలాగే చలికాలంలో అందరు కూడా నీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది డిహైడ్రేషన్ సమస్యకు దారితీస్తుంది. ఇకపోతే ఈ చలి కారణంగా వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం. ఇది కూడా చర్మం లో ఉండే తేమ పోవడానికి కారణం అవుతుంది. దీనివలన చర్మం పై పగుళ్లు అనేవి వస్తూ ఉంటాయి. వాతావరణం లో ఉన్నటువంటి చల్లని గాలి అనేది శరీరంలో ఉన్న తేమను పీల్చుకోవడం వలన చర్మం అనేది పొడిబారుతుంది. దీంతో చర్మం అనేది ఎంతో బలహీనంగా మారుతుంది. ఇకపోతే శరీరంలో విటమిన్ ఎ సి డి లోపం వలన కూడా స్కిన్ అనేది పగులుతుంది. ఈ సీజన్ లో ఎండ తక్కువగా ఉండటం కూడా ఈ సమస్యకు ఒక కారణం అని అంటున్నారు. ఇవేనండి చలికాలంలో చర్మం పగలడానికి కారణాలు. మరీ ఈ సమస్యలకు ఎలా చెక్ పెట్టాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఈ సీజన్ లో సబ్బులకు బదులుగా శనగపిండిని వాడితే మంచిది. ఈ శనగపిండిలో పాలు కలుపుకొని చర్మానికి అప్లై చేసుకుంటే చర్మం అనేది ఎంతో స్మూత్ గా మారుతుంది. అలాగే పెరుగులో తేనెను కలుపుకొని చర్మానికి అప్లై చేసుకోవాలి. మీరు ఇలా చేయడం వలన చర్మానికి నిగారింపు అనేది వస్తుంది. అంతేకాక ఎక్కువ వేడి నీటితో కూడా స్నానం చేయకూడదు అని నిపుణులు అంటున్నారు. అయితే చలి ఎంతగా ఉన్నా కూడా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలి అని అంటున్నారు నిపుణులు