Health Problems : 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేస్కుంటే మంచిదేనా.. కాదా.. తెలుసుకోండి!
Health Problems : మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది. మూడు ముళ్లు, ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే జంట.. జన్మజన్మాలు కలిసి ఉండాలని పెద్దలంతా దీవిస్తారు. అయితే ఈ మధ్య ఎక్కువ మంది 30 ఏళ్ల వయసొచ్చాక లేదా దాటాకే పెళ్లిల్లు చేసుకుంటున్నారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. ఆర్థికంగా ముందు స్థిర పడ్డాకే పెళ్లి చేసుకోవాలనుకునేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అయితే 30 ఏళ్లు దాటాకా పెళ్లి చేసుకుంటే మంచిదా లేదా అనే అనుమానం చాలా మందికి వస్తుంటుంది. అయితే అసలు 30 ఏళ్లు వచ్చే దాకా పెళ్లిళ్లు చేస్కునేందుకు యువత ఎందుకు ఇష్ట పడడం లేదు, అంత లేటుగా చేస్కుంటే ఏమైనా సమస్యలున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.జీవితం వివాహం అన్న మాటతే ప్రారంభం అవుతుంది. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అనగానే అబ్బా ఇప్పుడే పెళ్లంటి అనే మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇంకా చదువుకుంటాం, మంచి ఉద్యోగంలో స్థిరపడతాం, ఆర్థికంగా వృద్ధి చెందాకా లేదా నాకిలాంటి వరుడు లేదా వధువే కావాలని పట్టుబట్టడం… అందులోనూ ఎక్కువ అమ్మాయిలు దొరక్కపోవడంతో పెళ్లి చేస్కునే వయసు మరింత పెరిగిపోతుంది. 30 ఏళ్లకి పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి లేదా అబ్బాయికి నచ్చిన సంబంధం దొరికి పెళ్లి చేస్కునే సరికి 35 ఏళ్ల దాటుతున్నాయి. కొందరకి అయితే 40 ఏళ్లు కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇలా లేటు వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది కాదనే చాలా మంది చెబుతున్నారు. ఎందుకంటే ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో ప్రేమ, ఆప్యాయతలను పంచే పెళ్లికి దూరంగా ఉండటం తప్పని సూచిస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన అచ్చటా, ముచ్చటా ఆ వయుసులో జరిగితేనే బాగుంటుందని తెలుపుతున్నారు.
లేటు వయసులో పెళ్లి చేస్కున్న వారిలో సంతాన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయట. అంతే కాకుండా 30 ఏళ్లు దాటిన వారికి పిల్లను ఇవ్వడానికి చాలా మంది వెనుకడుగు వేస్తున్నారట. అంతే కాకుండా వయసు పెరుగుతున్నా కొద్దీ జీవితం మీద ఆశ తగ్గుతుందట. పిల్లల్ని కని వారిని పెంచి పెద్ద చేయడం ఎందుకంటూ చాలా జంటలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారట. అంతే కాకుండా లేటు వయసులో పెళ్లి చేసుకొని, పిల్లల్ని కన్న వారిలో 50 ఏళ్ల వయసొచ్చినా పిల్లలు ఇంకా చిన్నగా ఉండడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట. అందుకే సరైన సమయంలో పెళ్లి చేసుకొని జీవితాన్ని హ్యాపీగా గడపమని సూచిస్తున్నారు పెద్దలు.