Health Benefits : మహిళలకు ఈ తెల్ల పసుపు తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits : మహిళలకు ఈ తెల్ల పసుపు తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు…!!

 Authored By aruna | The Telugu News | Updated on :8 February 2024,11:00 am

Health Benefits : పసుపు అంటే ప్రతి ఇంట్లో వాడుతూనే ఉంటారు. పసుపు వంటలకు, పూజలకు అలాగే ముఖ సౌందర్యం కోసం, ఆరోగ్యం కోసం ఇలా ఎన్నో రకాలుగా పసుపును వాడుతూ ఉంటారు. ఈ పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే పసుపు పసుపు కలర్ లో ఉంటుందని మాత్రమే మనకి తెలుసు. అయితే తెల్ల పసుపు కూడా ఉంటుందన్న సంగతి చాలా మందికి తెలియదు. అయితే ఇది చాలా ఉపయోగకరమైనది. ఈ తెల్ల పసుపులో ఉండే ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం… తెల్ల పసుపులో బోలెడు ఔషధ గుణాలు అలాగే ఆరోగ్యం ఉపయోగాలు ఉన్నాయి. తెల్ల పసుపు మహిళలకు అనేక సమస్యలకు చెక్ పెడుతుంది. స్త్రీల కు తెల్ల పసుపు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు పొందవచ్చు.. ఈ పసుపులో కర్కుమిన్, చక్కెర, సపోనిన్ అనేక మూలకాలు ఉంటాయి.

ఇది జీర్ణకోస వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.. ఇది శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడానికి సహాయపడుతుంది. దశాబ్దాలుగా తెల్ల పసుపును క్యాన్సర్ చికిత్సకు వినియోగిస్తున్నారు. అయితే తెల్ల పసుపు క్యాన్సర్ నిరోధక లక్షణాలకు బాధ్యత వహిస్తుంది. అలాగే అండాశయం, కడుపు, రొమ్ము రకాల క్యాన్సర్ వంటి వాటిని నివారించడంలో తెల్ల పసుపు ఔషధంలా ఉపయోగపడుతుంది.
అలాగే ముఖం మెరిసిపోవడానికి తెల్ల పసుపు ఎంతగానో సహాయపడుతుంది. ఇది మొటిమలు పిగ్మెంటేషన్ తొలగించడానికి సహాయపడుతుంది. రుతుక్రమంలో వచ్చే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ తెల్ల పసుపుతో టీ తయారు చేసుకోవచ్చు. లేదా తెల్ల పసుపును నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది బ్యాక్టీరియాని నశింప చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఎన్నో ఔషధ గుణాలు అధికంగా ఉన్న తెల్ల పసుపు కొలెస్ట్రాలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ నియంత్రించడానికి తెల్ల పసుపు సారం సహాయపడుతుంది. దీని సారం తాగడం వలన కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు దీనిలో ఉండే కర్క్ మెన్ ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అనేక రకాల పొట్ట సంబంధ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.. తెల్ల పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యకరమైన కణాలలో ఫ్రీ రాడికల్స్ అక్షికరణ ఒత్తిడి పెరుగుదలను నిరోధిస్తాయి. ఆర్థరైటిస్ లాంటి సమస్యలను దూరం చేయడంలో తెల్ల పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. మోకాళ్ళ నొప్పులు లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది.. రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది