Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక శాస్త్రీయ కారణం ఇదే!
ప్రధానాంశాలు:
Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక శాస్త్రీయ కారణం ఇదే!
Spicy Food : చాలామందికి మసాలా తిండి అంటే ముచ్చటే. ముఖ్యంగా కారం పుల్లలుగా ఉండే భోజనాన్ని ఎంతో మంది ఆస్వాదిస్తారు. అయితే, కొంచెం కారం ఎక్కువైందంటే చాలు నోరు మండిపోవడం మొదలై, “హుస్.. హుస్…” అనే శబ్దాలు, నీటి కోసం తెగ వెతకడం మొదలవుతుంది. అంతే కాదు, ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. అసలెందుకు ఇలా జరుగుతుంది? దీనికి శాస్త్రీయ కారణం ఏంటి?

Spicy Food : కారం తిన్న వెంటనే నోరు మండుతుంది ఎందుకు? దీని వెనుక శాస్త్రీయ కారణం ఇదే!
Spicy Food : ప్రధాన కారణం ఇదే..
అమెరికన్ కెమికల్ సొసైటీ చేసిన ఓ అధ్యయనం ప్రకారం, మిరపకాయల్లో కెప్సైసిన్ (Capsaicin) అనే రసాయనం ఉంటుంది. ఇది మిర్చి తేడా తెలియజేసే ప్రధాన కారణం. ఈ కెప్సైసిన్ రసాయనం సహజంగా మిరప మొక్కలో ఉత్పత్తి అవుతుంది, దానిని జంతువులు లేదా మనుషులు తినకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. కెప్సైసిన్ నోటికి తగిలిన వెంటనే మన శరీరం దాన్ని ఒక “దురద, మంట కలిగించే పదార్థం”గా గుర్తిస్తుంది. దాంతో నోటి లోపల నరాలకు సంకేతాలు పంపిస్తూ మంటగా అనిపించడాన్ని ప్రారంభిస్తుంది . శరీరం వెంటనే స్పందించి, దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేస్తుంది.
కెప్సైసిన్ నీటిలో కరిగే లక్షణం లేని రసాయనం కావడం వల్ల, నీరు తాగినా అది పెద్దగా ఉపశమనం కలిగించదు. దీనికి బదులుగా పాలు లేదా పెరుగు వంటి కొవ్వు కలిగిన పదార్థాలను తీసుకుంటే మంట తగ్గుతుంది. ఎందుకంటే కెప్సైసిన్ ఫ్యాట్-సాల్యూబుల్ అయినందున, కొవ్వుతో కలిసిపోతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే మిర్చిలోని కెప్సైసిన్ అనే రసాయనం వల్లే మంట అనిపిస్తుంది. అది శరీరంలోకి వచ్చిన వెంటనే మన డిఫెన్స్ మెకానిజం పని చేయడం వల్లే ముక్కు, కళ్ల నుంచి నీరు వస్తుంది. ఇది సహజ శరీర స్పందన.