Bananas : మగ ఎలుకలు అరటిపండును చూసి పారిపోతాయట.. ఎందుకో తెలుసా…?
Bananas : ఎలుకలు మన ఇంట్లోకి వస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాం. వాటిని తరిమి కొట్టడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఎలుకలు ఇంట్లో వస్తువులను పాడు చేస్తాయి. ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులను పదునైన పళ్ళతో కొరుకుతూ పాడు పాడు చేస్తాయి. ఎలుకలు చేసే అల్లరి మామూలుగా ఉండదు. వాటిని వదిలించుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లి, లవంగాలు వంటి చిట్కాలను పాటిస్తుంటాం. అయితే అరటి పండ్ల నుంచి కూడా ఎలుకలు పారిపోతాయని సైంటిస్టులు చెబుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయట. అరటి పండ్ల నుంచి వచ్చే వాసన ఎలుకలకు అస్సలు నచ్చదట. ఆ వాసన చూస్తే ఎలుకలు ఒత్తిడికి గురవుతాయి. వాటిలో ఓ రకమైన హార్మోన్ రిలీజ్ అవుతాయని పరిశోధనలో తేలింది.
అరటిపండ్ల వాసనలో ఎన్పెంటైల్ అసిటేట్ అనే సమ్మేళనం ఉంటుంది. దీని కారణంగా ఎలుకలో ఉద్రిక్తత ఏర్పడుతుందని వారు తెలిపారు. అయితే అరటి పండ్ల నుంచి మగ ఎలుకలు మాత్రమే పారిపోతాయని సైంటిస్టులు తెలిపారు. అరటి పండ్లలో ఉండే కెమికల్ వాసన ఆడ ఎలుకల మూత్రం నుంచే వచ్చే వాసన ఒకేలా ఉంటాయి అని తేల్చారు. మగ ఎలుకల నుంచి తమ పిల్లల్ని దూరంగా ఉంచడానికి తమ మూత్రంలో ఒక రకమైన రసాయనాన్ని రిలీజ్ చేస్తుంటాయి. ఈ రసాయనం మగ ఎలుకలలో ఒత్తిడిని తెస్తుంది. ఆ వాసనను చూసిన వెంటనే మగ ఎలుకలు తీవ్రవత్తిడికి గురవుతుంటాయి. ఆ వాసన వస్తే వెంటనే పారిపోతాయి.

Why rats are afraid of bananas
అయితే ఆడ ఎలుకలు అరటి పండ్లను ఇష్టంగా తింటాయి. మగ ఎలుకలు గర్భిణి లేదా పాలిచ్చే ఆడ ఎలుకలకు దూరంగా ఉంటాయి. ఎందుకంటే గర్భిణి ఎలుకల మూత్రంలో ఉండే ఎన్ పెంటైల్ అసిటేట్ వలన మగ ఎలుకలు సమస్యలకు గురవుతాయి. గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుక మూత్రం వాసన మగ ఎలుకలలో ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే మగ ఎలుకలు పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. అయితే గర్భిణీ లేదా పాలిచ్చే ఎలుకల మూత్రం వాసన అరటిపండు వాసనను కలిగి ఉంటుంది. అందుకే మగ ఎలుకలు అరటి పండ్లను ఇష్టపడవు. అందుకనే అరటి పండుని చూడగానే మగ ఎలుకలు పారిపోతాయని అధ్యయనాల్లో తేలింది.