Laptop : వామ్మో.. ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తే ఇన్ని సమస్యలు వస్తాయా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Laptop : వామ్మో.. ల్యాప్ టాప్ ఒడిలో పెట్టుకొని పని చేస్తే ఇన్ని సమస్యలు వస్తాయా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2024,11:30 am

Laptop : ఆధునిక యుగం లో కంప్యూటర్ లేనిది పని అవ్వటం కష్టం. ఉపాధి కూడా దానితోనే. ఇలా రోజు ల్యాప్ టాప్ మన రోజు వారి జీవితంలో ఒక భాగంగా మారింది అని చెప్పొచ్చు. అవసరం మేరకు వాడిన సక్రమంగా వినియోగించుకున్నట్లయితే నయం కానీ ప్రమాదకర రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయకారం చూస్తే, పురుషులు తమ ఒడిలో ల్యా ప్ టాప్ తో గంటల తరబడి పని చేయటం వారి పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపుతుంది అని తెలిపారు. అయితే చాలా మంది పురుషులు తమ ఒడిలో ఎక్కువ ల్యాప్ టాప్ లోను వాడుతూ ఉంటారు. దీని వలన ఏం జరుగుతుంది. అనే విషయాల గురించి వారికి తెలియదు. అయితే ఈ పద్ధతి పురుషుల ఆరోగ్యానికి మంచిది కాదు అని నిపుణులు తెలిపారు. క్రమంగా ఇది పురుషుల లైంగిక జీవితం సంతానంపై ప్రభావం పడే అవకాశం ఉంది అని తెలిపారు…

ఒడిలో ల్యాప్ టాప్ పెట్టుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు :

1. ప్రతినిత్యం వేడికి గురికావడం వలన వృషణాలలో ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. అలాగే పురుషుల స్మెర్మ్ నాణ్యత కూడా చాలా తగ్గుతుంది.

2. అయితే పురుష పునరుత్పత్తి వ్యవస్థ ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోవటమే దీనికి కారణం. స్పెర్మ్ ఉత్పత్తి పని తీరుకు చల్లని వాతావరణం అవసరం అని నిపుణులు తెలిపారు.

3. ల్యాప్ టాప్ ను ఒడిలో ఉంచినప్పుడు దాని నుండి వచ్చే వేడి అనేది వృషణాల ఉష్ణోగ్రతను పెంచి లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది స్క్రోటల్ హైపర్ టెర్మియా అనే సమస్యకు కూడా దారితీస్తుంది. ఇంకా పలదీకరణానికి ఆటంకం కూడా కలుగుతుంది.

4. ల్యాప్ టాప్ ను ఒడిలో ఉంచి పని చేస్తున్నప్పుడు ల్యాప్ టాప్ లు తరచూగా విద్యుత్ అయస్కాంత తరంగాలను డిలీట్ చేస్తాయి. ఇది స్మెర్మ్ ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది అని నిపుణులు తెలిపారు.

5. కాబట్టి ఎవరైనా ఒడిలో ల్యాప్ టాప్ ఉంచుకొని పనిచేయటం మంచిది కాదు. ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం పడుతుంది అని నిపుణులు తెలిపారు. అలా పని చేస్తూ ఉంటే ఇప్పటికైనా బంద్ చేయటం చాలా మంచిది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది