Yoga Asanas for Women : మహిళల పీరియడ్ టైం లో ఇబ్బందులను దూరం చేసే సులువైన వ్యాయామాలు…!!
Yoga Asanas for Women : కొంతమంది మహిళలు నెలసరి సమయంలో ఎన్నో ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు. మామూలు టైం లో ఎంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ పీరియడ్ సమయాల్లో కొంచెం విసుగ్గా, చిరాగ్గా ఉంటారు. దీనికి త్రీవరమైన కడుపునొప్పి అవ్వచ్చు. సాహాజంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఈ సమస్యలు మరింత అధికమవుతూ ఉంటాయి.. అయితే పీరియడ్ సమయాలలో ఆడవారి కి నొప్పి నుంచి బయటపడడానికి కొన్ని వ్యాయామాలు సహాయపడతాయి. మహిళలు శారీరకంగా దృఢంగా ఉండడానికి వ్యాయామం బాగా సహాయపడుతుంది. నిత్యము యోగ చేయడం వలన ఉత్సాహంగా ఉండవచ్చు.
మనసు తను ఆత్మని ఏకం చేసే సాధనం యోగ. మనిషిని సమతుల్యంగా ఉంచడంలో ఈ వ్యాయామాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతర్గత బలాన్ని పెంచడానికి పీరియడ్ సమయంలో వచ్చే నొప్పి నుంచి బయటపడేయడానికి యోగ ఆసనాలు బాగా సహాయపడతాయి. నెలసరి మూలంగా వచ్చే నొప్పి మహిళల రోజువారి దినచర్యను తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. రుతుస్రావంలో కడుపులో నొప్పి అధిక రక్తస్రామం లాంటి ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఈ నొప్పి నుంచి ఈ ఆసనాలు బయటపడేస్తాయి. మహిళలకు పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించడానికి ఎలాంటి ఆసనాలు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…!!
జాను శీర్షాసనం : ఈ వ్యాయామం వలన ఉదర కండరాలను యాక్టివ్ చేస్తుంది. అంతర్గత అవయవాల్ని ఒత్తిడి కలిగేలా చేస్తుంది. ఎన్ని ముఖ భుజాలు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఆడవారి ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి ఈ ఆసనాలు వేయాల్సి ఉంటుంది.
సేతు బందాసనం : ఈ ఆసనం వేనక కండరాలు కోర్ ను బలోపితం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం కడుపునొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. మూత్రపిండాలకి శక్తిని ఇస్తుంది. రుతు తిమ్మిరిని కూడా తగ్గేలా చేస్తుంది. అలాగేనాడు వ్యవస్థ బాగా పనిచేసేలా ఉపయోగపడుతుంది. శరీరంలో రక్తపోటును కంట్రోల్ చేస్తుంది.
ధనురాసనం : ఈ ఆసనం పునరుత్పత్తి అవయవాలను ఉత్సాహంగా పరుస్తుంది తిమ్మిరిని తగ్గిస్తుంది. గ్యాస్ మలబద్దకం నుండి ఉపశమనం కలిగేలా చేస్తుంది. జీర్ణ క్రియ కు ఉపయోగపడుతుంది. మహిళలు తప్పనిసరిగా చేయవలసిన ఆసనాలలో ఇది ఒకటి ముఖ్యం.
మృత్యాసనం : థైరాయిడ్ పారా థైరాయిడ్ గ్రంథాలు పనితీరును ఈ ఆసనం కంట్రోల్ చేస్తుంది. చాతిని తెరుస్తుంది. లోతైన శ్వాసకు ఉపయోగపడుతుంది. వెన్నుముకను బలంగా చేస్తుంది. పీరియడ్ క్రాంపులను తగ్గించడంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ ఆసనం వేయడం వలన పీరియడ్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. ఉపవిష్ణ కోణాసనం : ఈ ఆసనం ఉదర అవయవాలను ఉత్తేజ పరుస్తుంది. సహజ ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది పూర్తి విశ్రాంతికి ఉపయోగపడుతుంది.