Leg Attack : లెగ్ ఎటాక్ గురించి ఎప్పుడైనా విన్నారా…?హార్ట్ ఎటాక్ కంటే ప్రమాదకరమైనది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Leg Attack : లెగ్ ఎటాక్ గురించి ఎప్పుడైనా విన్నారా…?హార్ట్ ఎటాక్ కంటే ప్రమాదకరమైనది…!

Leg Attack : హార్ట్ ఎటాక్.. దీని గురించి మనందరం చాలా సందర్భాలలో విన్నాం చూసాం. అయితే లెగ్ ఎటాక్ అనే వ్యాధి కూడా ఉందని మీలో ఎవరికైనా తెలుసా…? అవును మీరు వింటున్నది నిజమే..లెగ్ ఎటాక్ కూడా ఉంది. హార్ట్ ఎటాక్ ఎంత ప్రమాదమో లెగ్ ఎటాక్ కూడా అంతే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లెగ్ ఎటాక్ అంటే ఏంటి.? ఈ వ్యాధి వలన వచ్చే లక్షణాలు ఏంటి..? దీనికి ఎలాంటి చికిత్స […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 March 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Leg Attack : లెగ్ ఎటాక్ గురించి ఎప్పుడైనా విన్నారా...?హార్ట్ ఎటాక్ కంటే ప్రమాదకరమైనది...!

Leg Attack : హార్ట్ ఎటాక్.. దీని గురించి మనందరం చాలా సందర్భాలలో విన్నాం చూసాం. అయితే లెగ్ ఎటాక్ అనే వ్యాధి కూడా ఉందని మీలో ఎవరికైనా తెలుసా…? అవును మీరు వింటున్నది నిజమే..లెగ్ ఎటాక్ కూడా ఉంది. హార్ట్ ఎటాక్ ఎంత ప్రమాదమో లెగ్ ఎటాక్ కూడా అంతే ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ లెగ్ ఎటాక్ అంటే ఏంటి.? ఈ వ్యాధి వలన వచ్చే లక్షణాలు ఏంటి..? దీనికి ఎలాంటి చికిత్స విధానాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

అయితే ఈ లెగ్ ఎటాక్ ను లింబ్ ఇస్కీమియా అని కూడా పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. మరీ ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 20% మధుమేహ బాధితులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు నివేదికలు సైతం తెలియజేస్తున్నాయి. ఇక ఈ వ్యాధి బారిన పడినట్లయితే కొన్ని సందర్భాలలో కాళ్లు కూడా తొలగించాల్సిన పరిస్థితి వస్తుందట. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే రోగి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే కాళ్ళ చీరాల్లో రక్తప్రసరణ సక్రమంగా జరగకపోవడం వలన ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందట. ఇక ఈ లెగ్ ఎటాక్ లో మరో ప్రమాదకరమైన అంశం ఏంటంటే దీనిని చివరి దశ వరకు గుర్తించడం చాలా కష్టం. 50 ఏళ్లు పైబడినవారు, స్థూలకాయులు,రక్తపోటు ఎక్కువగా కలిగిన వారు అలాగే పొగ తాగే వారిలో ఈ లెగ్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధిని ఎలా గుర్తించాలి…

ఈ వ్యాధి సోకిన వారికి కాళ్లు లేదా పాదాలు క్రమంగా పాలిపోతూ ఉంటాయి. కాళ్లు నీలిరంగు లేదా ముదురు ఎరుపు రంగులోకి మారతాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఈ వ్యాధి భారిన పడినట్లు గుర్తించాలి. అదేవిధంగా ఈ రక్తనాళాల జబ్బులు నిర్ధారణ చేయడానికి యాంజియోగ్రామ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ వ్యాధికి ప్రాథమిక దశలో సరైన మందులు జీవనశైలిలో మార్పులు ద్వారా చికిత్స చేయడం జరుగుతుంది. ఇక ఈ వ్యాధికి ఎంత త్వరగా చికిత్స చేస్తే అంత మంచిది అని చెప్పాలి. కావున షుగర్ పేషెంట్స్ ప్రతి సంవత్సరం ఈ వ్యాధికి సంబంధించిన పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది