Zodiac Signs : ఈ రాశుల వారికి పెళ్లంటే మహా భయమండోయ్.. అందులో మీరున్నారో చూసుకోండి..
Zodiac Signs : జనరల్‌గా యుక్త వయసుకు వచ్చిన యువతీ యువకులు మ్యారేజ్ గురించి కలలు కంటుంటారు. ఎప్పుడెప్పుడు మ్యారేజ్ చేసుకుందామా అని అనుకుంటారు. ఈ క్రమంలోనే కెరీర్ పైన ఫోకస్ చేసి తద్వారా మ్యారేజ్ గురించి ఆలోచన చేస్తుంటారు. అయితే, ఈ రాశుల వారు మాత్రం అలా కాదండోయ్.. వీరికి మ్యారేజ్ అంటే చాలా భయం. మ్యారేజ్‌ను ప్రతీ సారి పోస్ట్ పోన్ చేస్తుంటారు. వివాహ బంధంలోకి అడుగు పెట్టాలనే ఆలోచన వీరికి రాదు అసలే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారు తమకున్న భయం వల్ల అటువంటి ఆలోచన వచ్చినా పక్కన పెట్టేస్తుంటారు. వారు ఏయే రాశుల వారంటే..జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్పే వివరాల ప్రకారం..ఈ రాశుల వారు మ్యారేజ్ అంటే చాలా భయపడిపోతుంటారు.
అవి ఏయే రాశులంటే.. కన్యా, వృశ్చిక, ధనస్సు, మీన. జ్యోతిష్య శాస్త్ర పెద్దల ప్రకారం.. ఈ రాశుల వారు మ్యారేజ్ అంటే చాలు భయపడిపోతుంటారు. అయితే, ఈ రాశుల వారిలో కామన్ ఫ్యాక్టర్ పెళ్లికి భయపడిపోవడం అయినప్పటికీ ఒక్కో రాశికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కన్యా రాశి వారు పెళ్లి విషయంలో భయపడిపోతుంటారు. అయితే, వీరు ప్రతీ విషయాన్ని బాగా స్టడీ చేస్తుంటారు. దాంతో తమకు కాబోయే జీవిత భాగస్వామి కూడా అలానే తెలివైన వారు అయి ఉండాలని అనుకుంటుంటారు. అలా వీరు లైఫ్ పార్ట్ నర్ పొందడానికి చాలా టైం పడుతుంది.వృశ్చిక రాశి తము అనుకున్న అభిప్రాయాన్ని వ్యక్తపరచడంలో మొహమాటపడుతుంటారు.

these zodiac signs persons will have fear of marriage
Zodiac Signs : నలుగురికి నచ్చినవి..వీళ్లకు అస్సలు నచ్చవు..
ఎల్లప్పుడు తమ భావాలను మనసులో దాచుకుంటారు. దాంతో వీరు పెళ్లి గురించి తమకున్న భయాన్ని అలానే దాచేసుకుని భయపడిపోతుంటారు. ఈ క్రమంలోనే తమ మనసులో మాటను భాగస్వామికి చెప్పలేక, వివాహ బంధంలోకి అడుగు పెట్టలేకపోతుంటారు. ధనస్సు రాశి వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ప్రతీ పనిని తమంతట తాము సొంతంగా చేసేందుకుగాను ఇష్టపడుతారు. తమ జీవితంలో ఇతరుల జోక్యాన్ని ఇష్టపడరు. మీన రాశి వారు.. చాలా ప్రతిభావంతులు. ప్రతీ పనిలో విజయం అందుకుంటారు. ఈ క్రమంలోనే తమ లైప్ పార్ట్ నర్ విషయంలో సరైన డెసిషన్ తీసుకోవాలనుకుని టైం బాగా తీసుకుంటుంటారు. ఎంపికకు టైం చాలా పడుతుంది.