Inspirational : తండ్రి పేదరికంపై పోరాటం చేస్తే.. కొడుకు క్లీనిక్ ఓపెన్ చేసి రూపాయికే ట్రీట్ మెంట్ చేస్తున్నాడు.. రోజుకు ఎంతమందికి వైద్యం అందిస్తున్నాడో తెలుసా?

Inspirational : తమిళ టాప్ హీరో విజయ్ నటించిన మెర్సల్ సినిమాకు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అందులో ఆయన ఒక్క రూపాయికే వైద్యం అందిస్తూ… ప్రజలకు సేవ చేస్తాడు. ఆ సీన్ చూసిన ప్రతీ ఒక్కరూ ‘హా ఇది సినిమా కాబట్టి ఇలా చూపిస్తున్నారే తప్ప నిజ జీవితంలో ఇలా ఎవరూ చేయరు’ అని మన మనసులో అనిపిస్తుంది. కానీ దాన్ని నిజం చేసి చూపిస్తున్నాడు ఒడిశాకు చెందిన డాక్టర్ శంకర్ రాం చందానీ. నిజంగానే ఒక్క రూపాయికే వైద్యం చేస్తూ… వేలాది మంది రోగులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాడు. గతేడాదే ఒడిశాలో ఒక రూపాయి క్లినిక్ ని ప్రారంభించాడు. అయితే ఇంత తక్కువ ధరకే ఆయన వైద్యం ఎందుకు అందిస్తున్నాడు, అతని కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.డాక్టర్ శంకర్ రామ్ చందానీ వాళ్లది చాలా పెద్ద కుటుంబం. వాళ్ల ఇంట్లో మొత్తం 32 మంది సభ్యులు ఉండేవాళ్లు. అయితే వారందరి సంరక్షణా బాధ్యత తన తండ్రి అయిన బ్రహ్మానంద్ చందానిదే. అయితే ఆయనకు చిన్న స్టేషనరీ దుకాణం ఉండేదట.

Advertisement

చాలా కష్టపడుతూ ఆయన ఆ కుటుంబ భారాన్ని నెట్టుకొచ్చాడు. ఈ క్రమంలోనే రామ్ చందానీ తాత, మామలు క్యాన్సర్ తో ప్రాణాలు విడిచారు. వారిని కాపోడుకోలేకపోయినందుకు తన తండ్రి ఎంతగానో బాధపడ్డారట. వారికి ఆసుపత్రిలో వైద్యం చేయించాలంటే చాలా కిలో దూరం వెళ్లాల్సి వచ్చేదట. చికిత్స ఉచితమే అయినప్పటికీ తమ దగ్గర ఉన్న డబ్బు రవాణా ఖర్చులకు కూడా సరిపోయేది కాదట. అలా తమ ప్రాంతంలోని ఎంతో మంది వైద్యం కోసం చాలా ఇబ్బందులు పడేవారు. దానిని చూసిన డాక్టర్ శంకర్ రాంచందానీ తండ్రి.. తన పిల్లలను బాగా చదివించి వైద్యులను చేయాలని నిర్ణయించుకున్నారట. అలా తన కొడుకులు డాక్టర్లు అయ్యి.. పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన ఎన్నో కలలు కన్నారు. అందుకోసం ఎంతగానో శ్రమించారు. కానీ తర్వాత కొంత కాలానికే ఆయన చనిపోయారు. దీంతో కుటుంబ బాధ్యత శంకర్ రాం చందానీ అన్నపై పడింది. నలుగురు సోదరులను, మరో నలుగురు సోదరీమణులను చదివించడం..

odisha one rupee doctor shanker ram chandani special story
odisha one rupee doctor shanker ram chandani special story

వారి పోషణ అంతా ఆయనే చూసుకునేవారు. ఇలా ఎన్నో కష్టాలు పడి శంకర్ రాం చందానీ డాక్టర్ అయ్యాడు.అయితే తండ్రి ఆశయం మేరకు 2021వ సంవత్సరం ఫిబ్రవరిలో సంబర్ పూర్ జిల్లా బుర్లాలో ఒక రూపాయి క్లినిక్ ని ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 7 వేల మందికి పైగా వైద్యం అందించాడు. ఆయన ప్రతీరోజు 20 నుంచి 30 మందికి ఓపీ సేవలు అందిస్తారు. అంతే కాదండోయ్ ఒక రూపాయి క్లినిక్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక రూపాయి ఒషధ సేనని కూడా ప్రారంభించారు. అంటే రూపాయికే నాణ్యమైన మందులను కూడా అందిస్తారు. ముందుగా తన తండ్రి పేరిట వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలనుకున్నా.. పెట్టుబడి పెట్టే స్థోమత లేక ఈ ఒక రూపాయి క్లినిక్‌ని ప్రారంభించానని డాక్టర్ శంకర్ రాం చందానీ చెప్తున్నారు. అంతే కాదు ఆ ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి కారణం… తన పేషంట్లు ఉచితంగా ట్రీట్ మెంట్ తీసుకున్నట్లు భావించకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లు వివరించారు. తన తండ్రి మాట మేరకు… ప్రజలకు ఇలా సేవ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన చెబుతున్నారు.

Advertisement