PHD Bharathi : కూలీ పనికి వెళ్తూ పీహెచ్డీలో పట్టా సాధించిన ఓ మహిళ కథ.. ఏకంగా రోజు 8 కి.మీ నడిచి వెళ్లి ..!
PHD Bharathi : ప్రస్తుత కాలంలో ఆడవాళ్లు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. ఆడవాళ్లకు కొంచెం అవకాశం కల్పిస్తే చాలు వాళ్లు ఏంటో నిరూపించుకుంటారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో కూలి పని చేసే ఓ మహిళ పీహెచ్డి లో కెమిస్ట్రీ చేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేని భారతి అనే మహిళ అందరికీ ఆదర్శప్రాయం. అనంతపురం జిల్లా నాగాలాగుడెం గ్రామానికి చెందిన భారతి ప్రతిరోజు 8 కిలోమీటర్లు నడిచి వెళ్లి పిహెచ్డి లో కెమిస్ట్రీ చేశారు.
ఆమె ముందు పేదరికం కూడా తల వంచిందేమో అనిపిస్తుంది. ఆమె ఆత్మ విశ్వాసానికి హాట్సాఫ్ చెప్పాలి. పేద కుటుంబానికి చెందిన భారతికి పెళ్లి అయి పిల్లలు కూడా ఉన్నారు. ప్రతిరోజు వ్యవసాయ పనులు చూసుకుంటూ భర్త పిల్లలను చూసుకుంటూ పీహెచ్డీ చేశారు. ఆమె భర్త కూడా ఆమెకు అండగా నిలబడ్డాడు. ఆమెకు చదువుపై ఉన్న ఆసక్తిని గ్రహించి కష్టపడి తన భార్యను చదివించారు. పురుషాధిపత్యాన్ని చూపించకుండా ఆమె భర్త ఆమెకు సహాయం చేశారు. ఎందుకు ఆయనను ఎంత అభినందించిన తక్కువే అవుతుంది. ఇక భారతి కూడా తన భర్త కష్టాన్ని నమ్మకాన్ని కొమ్ము చేయకుండా కష్టపడి మంచి ఫలితాన్ని ఇచ్చారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో భారతికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు ఆమెకు ఆర్థికంగా సహాయం చేశారు. పెళ్లి అనేది ఆటంకం కాదని ఎంతో కష్టపడి చదివిన భారతికి ఆర్థికంగా, నైతికంగా, ప్రభుత్వం ఆమెకు ప్రొఫెసర్ గా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం ఇస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు. ఇలా కష్టపడుతున్న ఆడవాళ్లకు, మట్టిలోని మాణిక్యాలకు చదువు తప్పనిసరిగా అందాలి. రాష్ట్రపతి చేత పట్టా అందుకున్న భారతి నిరుపేద ఆడపిల్లలకు ఆదర్శం అని చెప్పాలి. చదువుకు పేదరికం అసలు అడ్డు కాదని ఈమెను చూస్తే తెలుస్తుంది.