Inspirational : నదిలో నుంచి 700 కిలోల చెత్తను తొలగించిన యువతి.. ఎందుకో తెలుసా?
Inspirational : ఓ యువతి.. ఒంటరిగా.. ఎవరి తోడు అవసరం లేకుండా.. ఓ నదిలో ఉన్న 700 కిలోల చెత్తను తొలగించింది. తన పేరు స్నేహా సాహి. తనది గుజరాత్. నీళ్లలో ప్లాస్టిక్, చెత్త లాంటి వేస్ట్ ఉంటే నీళ్లలో నివసించే ప్రాణులకు నష్టం ఏర్పడుతుంది. వాటికి శ్వాస ఆడదు. అవి మనుగడ సాధించలేదు. అందుకే.. ఆ నదిలో ఉండే ప్రాణాలను కాపాడటం కోసం ఆ యువతి నడుం బిగించింది.తను ఒంటరిగా.. ఎవరి సాయం లేకుండా.. 700 కిలోల చెత్తను తీసేసింది.
Inspirational : నదిలో నుంచి ప్లాస్టిక్, థర్మకోల్, గ్లాస్ బాటిల్స్ తీసేసిన యువతి
ఆ నదిలో ఉండే తాబేళ్లు, చేపలు, మొసళ్ల ప్రాణాలను కాపాడి ఎన్నో యంగ్ అవార్డులను గెలుచుకుంది.నదుల్లో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల.. థర్మకోల్, గ్లాస్ బాటిల్స్.. ఇతర చెత్త వల్ల అందులో ఉండే ప్రాణులకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే.. వాటికి ఎటువంటి ప్రమాదం లేకుండా.. తను ఈ పని చేసింది. అప్పుడప్పుడు కొందరు స్టూడెంట్స్ వచ్చి తనకు ఈ పనిలో సాయం చేసేవాళ్లు.
అలా ఆ యువతి చేసిన పనికి.. చాలామంది మెచ్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తనకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. ప్రకృతి అంటే ఇష్టం. ప్రకృతిలో మమేకమై జీవించే జీవులంటే ఇష్టం. అందుకే.. ఈ పని చేసి.. ఇప్పుడు శభాష్ అనిపించుకుంటోంది.