Inspirational News : లక్షలు వచ్చే సీఏ ఉద్యోగాన్ని వదిలేసి చాకొలేట్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Inspirational News : లక్షలు వచ్చే సీఏ ఉద్యోగాన్ని వదిలేసి చాకొలేట్ బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నాడు.. ఎక్కడో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :1 January 2023,2:00 pm

Inspirational News : సీఏ లేదా చార్టర్డ్ అకౌంటెంట్ చదువు చదవడం అంత ఈజీ కాదు. దాని కోసం చాలా కష్టపడాలి. చాలామందికి అది ఒక డ్రీమ్ మాత్రమే. దాన్ని పూర్తి చేయడం అంత ఈజీ కాదు. ఆ కోర్సును చాలా మంది మధ్యలోనే వదిలేస్తారు. అంత కష్టతరమైన కోర్సును పూర్తి చేసి ఉద్యోగంలో చేరి ఆ తర్వాత ఆ జాబ్ ను మానేశాడు. ఆ ఉద్యోగం నచ్చక దాన్ని వదిలేసి చాకొలేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్ లో సక్సెస్ అయి ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు. అతడే ప్రతీక్ కుమార్. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ కు చెందిన ప్రతీక్.. చాకొలేట్ స్టార్టప్ ను స్టార్ట్ చేశాడు.

చార్టర్డ్ అకౌంటెంట్ గా గోవాలో ఉద్యోగం చేస్తున్న సమయంలోనే తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. దీంతో చాక్లెట్ల బిజినెస్ ను స్టార్ట్ చేయాలనుకున్నాడు. కేవలం రూ.10 వేల రూపాయాలతో చాకొలేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు అతడికి దేశం మొత్తం 80 ప్రాంతాల్లో అతడి చాకొలేట్ స్టాల్స్ ఉన్నాయి. సాధారణంగా మార్కెట్ లో చాలా రకాల చాకొలేట్స్ దొరుకుతాయి కానీ.. ప్రతీక్ తయారు చేసే చాకొలేట్స్ నాచురల్ గా చేసినవి. వాటిలో ఎలాంటి ఆర్టిఫిషియల్ కంటెంట్ ఉండదు. ప్రస్తుతం 150 రకాల నాచురల్ చాకొలేట్స్ ను ప్రతీక్ తయారు చేస్తున్నాడు.

young man left ca job and started chocolate startup in jharkhand

young man left ca job and started chocolate startup in jharkhand

Inspirational News : అందరికీ నచ్చే షుగర్ ఫ్రీ చాకొలేట్స్ కు పెరిగిన గిరాకీ

అందరికీ నచ్చేలా షుగర్ ఫ్రీ నాచురల్ చాకొలేట్స్ ను ప్రతీక్ తయారు చేయడంతో అతడి చాకొలేట్స్ కు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా కూడా ప్రతీప్ ఈ చాకొలేట్స్ ను అమ్మడం ప్రారంభించాడు. ఈ చాక్లెట్ ధర రూ.25 నుంచి ప్రారంభం అవుతుంది. చాలామంది ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. మామిడి కాయ, అల్లం, గులాబీలు, కుంకుమపువ్వు, దాల్చిన చెక్క, నిమ్మకాయ, ఇతర పండ్లు అన్నీ కలిపి నాచురల్ పద్ధతిలో చాకొలేట్స్ ను తయారు చేయడం వల్ల దేశవ్యాప్తంగా ప్రతీక్ చాకొలేట్స్ కు డిమాండ్ పెరిగింది. ఆ చాకొలేట్ కు కొకొవాలేన్ అనే పేరు పెట్టాడు ప్రతీక్.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది