అనాథలకు అండగా ప్రభుత్వం…. ఒక్కొక్కరికి రూ. 10 రూపాయల నగదు
కడప : కొవిడ్ కారణంగా అనాథలైన చిన్నారులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఈ సందర్భంగా వైఎస్సార్ జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు 18 సంవత్సరాల లోపు పిల్లల తల్లిందండ్రులో ఏ ఒక్కరు మృతి చెందినా ప్రభుత్వం 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.

government-in-favor-of-orphans
ఈ నగదు మొత్తాన్ని పిల్లల పేరుపై బ్యాంక్ లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, బాండ్లను అట్లూరు మండలం ముతుకూరుకు చెందిన అరవ రామిరెడ్డి, రమాదేవి పిల్లలు వెంకట శ్రీనాథ్‌రెడ్డి (16), మని (14), ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లెకు చెందిన షేక్ సయ్యద్, మహబూబ్‌బీ కుమార్తె కమాల్‌బీ (16), బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లెకు చెందిన జి.ప్రకాశం, ఫాతిమా దంపతుల కుమార్తె గొల్లపల్లె భవాని (17) ఉన్నారు. వీరందరికీ కలెక్టర్ వి. విజయరామరాజు తన ఛాంబర్‌లో బాండ్లను అందించారు.
ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ బీమా, ఇతర బీమాలతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందుతుందని తెలిపారు. సహాయం అందుకున్న వారంతా బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.