Mahaboonagar..7న ‘చలో హైదరాబాద్’కు వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు
నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ కావడం లేదని వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు అంటున్నారు. ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం వారు ‘చలో హైదరాబాద్’ కార్యక్రమ వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మారేడు శివ మాట్లాడుతూ విద్యారంగాన్ని పరిరక్షించాలని, ఖాళీలు భర్తీ చేయాలని కోరుతూ ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు తెలిపారు.
టీఆర్ఎస్ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదని విమర్శించారు. నిరుద్యోగ యువత, ప్రజలు అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఇకపోతే ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయకుండా కాలయాపన చేస్తున్న టీఆర్ఎస్ సర్కారు వైఖరిని నిరసిస్తూ హుజురాబాద్ ఉప ఎన్నికలో భారీ స్థాయిలో నిరుద్యోగులు అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్స్ వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.