Mahboobnagar..తెల్లవారుజామున 4 గంటలకు ఎస్పీతో బైక్‌పై మంత్రి పర్యటన
పర్యాటక, సాంస్కృతి, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటలకే తన పర్యటన షురూ చేశారు. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో ఏ మేరకు నష్టం జరిగింది? లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలు తెలుసుకునేందుకుగాను స్వయంగా ఆయనే బుల్లెట్ బండిపై వెళ్లారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డ్రైవింగ్ చేయగా, వెనక జిల్లా ఎస్పీ కూర్చొని ఉన్నారు.
భారీ వర్షం వల్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ భారీ వర్షం వల్ల వరద రూపంలో వచ్చిన నీటిని ఆ ప్రాంతాల నుంచి బయటకు పంపించేందుకు తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, మంత్రి బుల్లెట్ బండిపై పొద్దుపొద్దునే పర్యటన చేయడం చూసి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల కోసమే పని చేసే మంత్రి మనకు ఉన్నాడని అనుకుంటున్నారు.