అంతర్జాతీయ వేదికపై జిల్లావాసి.. మంత్రి అభినందన
భారతదేశంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చాలా ఇంట్రెస్ట్‌గా క్రికెట్ మ్యాచెస్ చూస్తుండటం మనం చూడొచ్చు. అయితే, ఈ క్రికెట్‌లో రాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ, కోరిక ఉంటే సరిపోదు. ఆచరణలో కృషి అత్యంత కీలకమని గుర్తించాలి. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరుకు చెందిన షోయబ్ జిల్లా కీర్తి పతాకను అంతర్జాతీయ వేదికపై ఎగురవేశాడు. ఇంగ్లాండ్‌లోని ఓవల్ వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచెస్‌కు సోనీ స్పోర్ట్స్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.
గతంలో పలు నేషనల్, ఇంటర్నేషనల్ మ్యాచెస్‌కు షోయబ్ రేడియోలో వ్యాఖ్యానం చేశారు. భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై 4వ తేదీ వరకు జరిగే టెస్ట్ నాల్గో మ్యాచ్, పదో తేదీ నుంచి పధ్నాలుగో తేదీ వరకు జరిగే ఐదో మ్యాచ్‌కు గాను ముంబైలోని సోనీ స్టూడియోలో తెలుగులో వ్యాఖ్యానం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అతడిని శుక్రవారం తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అభినందించారు. ఇంటర్నేషనల్ ప్లాట్ ఫాంపై తెలుగు భాషలో వ్యాఖ్యానం చేయబోతున్నందుకుగాను మంత్రి సింగిరెడ్డి, పెబ్బేరువాసులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.