Nalgonda.. ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: భగత్

0
Advertisement

నియోజకవర్గంలోని పేదల ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని నాగార్జున సాగర్ శాసన సభ్యుడు నోముల భగత్ తెలిపారు. ఆదివారం హాలియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నిడమనూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సైదమ్మ, దేవేందర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. సైదమ్మకు రూ.18 వేలు, దేవేందర్‌కు రూ.60 వేల సీఎం రిలీఫ్ ఫండ్ అందింది. ఈ సందర్భంగా ఎమ్మెల్య నోముల భగత్ మాట్లాడుతూ పేద ప్రజలకు అత్యద్భుతమైన వైద్య సేవలు అందించేందుకు కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు.

పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఓ వరమని, దానిని అవసరమైన వారు తప్పక సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతానని చెప్పారు. ఎమ్మెల్యే నోముల భగత్ తన తండ్రి నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డిపై పోటీచేసి గెలుపొందాడు భగత్.

 

Advertisement