Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]
Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
ఇవాళ 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ధర రూ.4795 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర రూ.5231 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,310 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.440 పెరిగింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.49,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,100 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,360 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.59 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1.60 పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.590 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.16 పెరిగింది. కిలో వెండి ధర రూ.59,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.1600 పెరిగింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.645 కాగా, కిలో వెండి ధర రూ.64500 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో మాత్రం 10 గ్రాముల వెండి ధర రూ.590 కాగా, కిలో వెండి ధర రూ.59000 గా ఉంది.