Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి […]
Today Gold Rates : బంగారం అనేది ఇప్పుడు విలువైన వస్తువు. ఒకప్పుడు బంగారం గురించి జనాలు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు బంగారం అనేది స్టేటస్ కు సింబల్. ఎవరి వద్ద ఎంత ఎక్కువ బంగారం ఉంటే, ఎన్ని ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే అంత గొప్పోళ్లు అన్నట్టుగా ఉంది నేటి సమాజం. అందుకే బంగారానికి నేడు అంత ఎక్కువ రేటు, అంత ఎక్కువ డిమాండ్. పెళ్లిళ్లు అయినా ఇతర శుభకార్యాలు అయినా బంగారానికి ఉన్న డిమాండే వేరు. పెళ్లికూతురుకు కనీసం ఒక అరకిల బంగారం అయినా కొని మెడలో వేయాల్సిందే. ఒకప్పుడు బంగారాన్ని ఎక్కువగా మహిళలే ఆభరణాలుగా ధరించేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. చివరకు పురుషులు కూడా బంగారాన్ని ఆభరణాలుగా చేయించుకొని వేసుకుంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు కూడా బంగారం ధరను రెట్టింపు చేశాయి. అందుకే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గత మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4665 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఇవాళ రూ.5089 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,950 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది.
వెండి ధరలు చూసుకుంటే, ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.58.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.585 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో వెండి ధర రూ.58,500 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా, కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.585 కాగా, కిలో వెండి ధర రూ.58500 గా ఉంది.