Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :18 August 2022,9:00 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

26 July 2022 Today Gold Rates In Telugu States

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4790 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.10 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,900 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5225 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.11 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.52,250 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,490 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,310 గా ఉంది.

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూస్తే ఒక గ్రాము వెండి ధర రూ.57.60 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.576 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.2 తగ్గింది. కిలో వెండి ధర రూ.57,600 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 తగ్గింది.

చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.633 కాగా, కిలో వెండి ధర రూ.63300 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది