Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :2 October 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

31 july 2022 today gold rates in telugu states

2 october 2022 today gold rates in telugu states

అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగి మహిళలకు షాకిచ్చాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి.

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు రూ.4650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.150 తగ్గింది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు రూ.5073 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.50,730 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.170 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది.

ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.56.90 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 10 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.569 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూపాయి తగ్గింది. కిలో వెండి ధర రూ.56,900 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.569 కాగా, కిలో వెండి ధర రూ.56900 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది