Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :25 September 2022,8:30 am

Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న కూడా బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

08 May 2022 today gold Rates in Telugu states

25 september 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.50 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.46,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5020 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.53 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50,200 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.530 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,350 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,050 కాగా,, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,240 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,200 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.56.30 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.563 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.56,300 గా ఉండగా నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది