Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :26 August 2022,8:30 am

Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి.

31 july 2022 today gold rates in telugu states

26 august 2022 today gold rates in telugu states

ఒక గ్రాము బంగారం 22 క్యారెట్లకు ఇవాళ రూ.4750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.47,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5182 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,820 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,690 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,820 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55.40 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.554 కాగా.. నిన్నటి ధరతో పోల్చితే రూ.4 పెరిగింది. కిలో వెండి ధర రూ.55,400 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.611 కాగా, కిలో వెండి ధర రూ.61100 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.554 కాగా, కిలో వెండి ధర రూ.55400 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది