Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, […]
Today Gold Rates : ఈరోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఒకప్పుడు బంగారం కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు కానీ.. నేడు ఒక తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిందే. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అయితే లక్షలకు లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పేద, మధ్యతరగతి ప్రజలు అయితే బంగారం వైపు చూడటానికి కూడా భయపడుతున్నారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా బంగారం ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినట్టుగా బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. మధ్యలో కొన్ని రోజులు తగ్గినా కూడా ఏదో తక్కువగా తగ్గి ఎక్కువగా ధరలు పెరుగుతున్నాయి. మొన్న బంగారం, వెండి ధరలు పెరిగాయి. నిన్న కూడా మరోసారి బంగారం ధరలు పెరగగా వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి రెండు ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4730 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.35 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.350 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5160 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.38 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,600 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.380 తగ్గింది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,420 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,350 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.54.80 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 60 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.548 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6 తగ్గింది. కిలో వెండి ధర రూ.54,800 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గింది.
చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.607 కాగా, కిలో వెండి ధర రూ.60700 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.548 కాగా, కిలో వెండి ధర రూ.54800 గా ఉంది.