Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, తగ్గిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం […]
Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి బంగారం ధరలు. మొన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు తగ్గాయి.
ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4580 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.45,800 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4997 గా ఉండగా, 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.49,970 గా ఉంది.
Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,450 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.45,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,130 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,860 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,020 గా ఉంది.
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,970 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.55 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 40 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.550 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.4 తగ్గింది. కిలో వెండి ధర రూ.55,000 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.400 తగ్గింది.
చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.600 కాగా, కిలో వెండి ధర రూ.60000 గా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో అదే ధర ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.550 కాగా, కిలో వెండి ధర రూ.55000 గా ఉంది.