SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్…3లక్షల స్కీమ్ కు అధికారిక ప్రకటన…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్…3లక్షల స్కీమ్ కు అధికారిక ప్రకటన…!

 Authored By ramu | The Telugu News | Updated on :30 March 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  SBI ఖాతాదారులకు బంపర్ ఆఫర్...3లక్షల స్కీమ్ కు అధికారిక ప్రకటన...!

SBI : తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటనలతో తమ ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చే దిశగా కొత్త పథకాలను ఆవిష్కరిస్తుంది. కొత్త స్కీమ్లను ప్రవేశపెట్టి దిశగా పరిశ్రమ ధోరణికి అనుగుణంగా బ్యాంక్ మేనేజ్మెంట్ వారి కస్టమర్ల సంక్షేమం కోసం చురుకైన చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే కస్టమర్ల ప్రయోజనాలకు మొదటి స్థానం ఇవ్వడం అనేది బ్యాంకు యొక్క ముఖ్య ప్రాధాన్యత.ఈ క్రమంలోనే బ్యాంకు వారి ఖాతాదారుల ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడానికి నిరంతరం ఏదో ఒక విధంగా పథకాలను ప్రవేశ పెడుతూనే ఉంటుంది.ఈ క్రమంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.

SBI కొత్త పథకం…

భారతదేశంలో అతిపెద్ద నెట్వర్క్ కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు SBI తమ వినియోగదారులకు గణనీయమైన ప్రయోజనాలను చేకూర్చే కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. అయితే సాధారణంగా మార్చి నెలలో చాలా బ్యాంకులకు ఆర్థిక కాలం అనేది ముగుస్తుంది. ఇక ఈ సమయంలో లావాదేవీలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకు యొక్క కొత్త చర్యలు ఏప్రిల్ తర్వాత అమలు చేయబడతాయి. ఈ క్రమంలోనే బ్యాంకులో వారికి అనుగుణంగా వారి పరిపాలన విధానాలను సిద్ధం చేసుకుని వస్తాయి. ఈ నేపథ్యంలోనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కళాష్ మరియు సీనియర్ సిటిజనుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ అలాగే తక్కువ వడ్డీ కి గృహ రుణం పథకాలను ప్రవేశ పెట్టడంం జరిగింది. ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి బ్యాంకు ఇటీవల చివరి తేదీని కూడా పొడిగించడం జరిగింది.అనేక రకాల పథకాల కోసం దరఖాస్తు గడువును పొడిగిస్తూ ఎస్బిఐ తాజాగా ప్రకటన విడుదల చేసింది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అమృత కలాష్ యోజన…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఆర్థిక పెట్టుబడి పథకం ద్వారా 7.10% వడ్డీ రేటును అందిస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 వరకు చివరి తేదీని పొడుగించడం జరిగింది. కావున పెట్టుబడిదారులు గడువు ముగిసేలోపు నిధులను ఉపసంహరించుకోవచ్చు. కానీ పెట్టుబడి మొత్తంలో 0.5 సున్న శాతం జరిమానా విధించబడనున్నట్లు సమాచారం.

SBI తక్కువ వడ్డీ గృహ రుణాలు…

ఖాతాదారుల గృహ నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు SBI తక్కువ వడ్డీరేట్లలో గృహ రుణాలను అందించడం జరుగుతుంది. అయితే ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకునే గడువును తాజాగా మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది. అయితే ఇక్కడ సిబిల్ స్కోర్ 750 నుండి 800 మధ్య ఉన్న వ్యక్తులు 8.60 శాతం వడ్డీతో రుణాలను పొందవచ్చు. 750 కంటే తక్కువ సిబిల్ స్కోర్ కలిగి ఉన్నవారు ఎక్కువ వడ్డీ రేటు విధించబడుతుంది.

SBI సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్…

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్ కు మద్దతు ఇస్తూ 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. అంటే పెట్టుబడిదారులు 5 నుండి 10 సంవత్సరాల వరకు సీనియర్ సిటిజన్ స్కీమ్ ఎంచుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకునే వారికి చివరి తేదీ మార్చి 31 వరకు పొడిగించడం జరిగింది.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది