Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ పరిస్థితులు […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :6 October 2022,8:30 am

Today Gold Rates : Today Gold Rates : ఒకప్పుడు బంగారం కొనాలంటే పెద్దగా ఎవ్వరూ ఆలోచించేవారు కాదు. కానీ నేడు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు ఎక్కువగా ఉపయోగించే గోల్డ్ ధరలు కొండెక్కడంతో సామాన్య ప్రజలు బంగారం వైపు చూడటమే మానేశారు. ఒకప్పుడు తులం బంగారం ఎలాగోలా కష్టపడి కొన్న సామాన్య  ప్రజలు నేడు తులం బంగారం కొనాలంటే రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

08 May 2022 today gold Rates in Telugu states

6 october 2022 today gold rates in telugu states

అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం వల్ల బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి తప్పితే తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా పెరుగుతున్నాయో.. బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చాయి. మొన్న బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగి షాకిచ్చాయి.

ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4775 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.40 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.400 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.5210 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.44 పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.52,100 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.440 పెరిగింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,900 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,150 గా ఉంది.

ఇక.. హైదరాబాద్ లో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.62 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 20 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, నిన్నటి ధరతో పోల్చితే రూ.2 పెరిగింది. కిలో వెండి ధర రూ.62,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.200 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది. ముంబై, ఢిల్లీ, కోల్ కతాలో 10 గ్రాముల వెండి ధర రూ.620 కాగా, కిలో వెండి ధర రూ.62000 గా ఉంది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది