7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈసారి భారీగానే పెరగనున్న డీఏ.. ఎంతంటే?
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. అయితే.. ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే డీఏ పెంపుపై వచ్చే ప్రకటన ఇది. మామూలుగా ఈసారి డీఏ పెంపు 3 శాతమే ఉంటుందని అంతా భావించారు. కానీ.. డీఏ పెంపు ఈసారి భారీగానే ఉండనుంది. దానికి సంబంధించిన ప్రకటన విడుదల చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. దీని వల్ల లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం 42 శాతం డీఏ అమలులో ఉన్న విషయం తెలిసిందే. అది మరో 3 శాతం పెరిగే చాన్స్ ఉంది అని అంతా అనుకున్నారు. 3 శాతం పెరిగితే డీఏ 45 శాతం కానుంది.
కానీ.. డీఏ పెంపు 3 శాతం కాదట. ఇంకా పెరిగే అవకాశం ఉందట. ఈ నెలలో డీఏ పెంపుపై త్వరలోనే ప్రకటన ఉండే అవకాశం ఉంది. సీపీఐ ఐడబ్ల్యూ జూన్ 2023 ఇండెక్స్ ప్రకారం డీఏ పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని డీఏను పెంచుతారు.ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం రేట్ ప్రకారం చూస్తే డీఏ పెంపు ఈసారి 3 శాతమే ఉంటుందని అనుకున్నారు. కానీ.. ఈసారి 3 కాదు.. 4 శాతం డీఏను పెంచుతారని అంటున్నారు. నిజానికి.. ప్రతి సంవత్సరం రెండు సార్లు డీఏ పెరుగుతుంది.
7th Pay Commission : 3 శాతం కాదు.. 4 శాతం పెరిగే చాన్స్
జనవరి, జులైలో. జనవరిలో పెరగాల్సిన డీఏ 4 శాతం మార్చి 2023 లో పెరిగింది. ఇక.. జులైలో పెరగాల్సిన డీఏ సెప్టెంబర్ నెలలో పెరిగే చాన్స్ ఉంది. 38 శాతంగా ఉన్న డీఏ మార్చిలో 4 శాతం పెరగగా.. 42 శాతం అయింది. సెప్టెంబర్ లో పెరిగితే అది 42 శాతం నుంచి 46 శాతంగా పెరగనుంది. వచ్చే క్యాబినేట్ భేటీలోనే డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో పెరిగినా కూడా డీఏ పెంపు జులై 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. అంతే.. జులై 1 నుంచే బకాయిలు చెల్లిస్తారు.