7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 3 శాతమే పెరగనున్న డీఏ.. 4 శాతం కాదట.. ఎందుకంటే?
7th Pay Commission : ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఎదురు చూసేది డీఏ పెంపుకోసమే. నిజానికి గత జూన్ లోనే డీఏ పెరగాల్సి ఉంది కానీ.. డీఏ ఇంకా పెరగలేదు. ఇది ఆగస్టు నెల. అయితే.. రాఖీ పౌర్ణమి సందర్భంగా డీఏ పెరిగే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి సంవత్సరం డీఏ రెండు సార్లు పెరుగుతుంది. ఒకటి జనవరిలో రెండు జూన్ లో. గత జనవరిలో పెరగాల్సిన డీఏ.. మార్చిలో పెరిగింది. 38 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరగగా.. అది 42 శాతం అయింది. మార్చిలో పెరిగినా బకాయిలు మాత్రం జనవరి 2023 నుంచి అందించారు.
ఇక.. జూన్ లో పెరగాల్సిన డీఏ ఇప్పటి వరకు పెరగలేదు. మరో 4 శాతం డీఏ పెరిగితే అది 42 నుంచి 46 శాతానికి పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా 4 శాతం డీఏ పెంపును ఊహిస్తున్నారు. కానీ.. కేంద్రం మాత్రం ఈసారి 3 శాతం డీఏ పెంచేందుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 4 శాతం కాకుండా 3 శాతమే పెంచబోతోంది అని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఏఐసీపీఐ ఐడబ్ల్యూ డేటా ప్రకారం 3 శాతం కంటే ఎక్కువ పెంచే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది.ప్రస్తుతం డీఏ 42 శాతం ఉంది. 4 శాతం పెరిగితే 46 శాతం పెరుగుతుంది. మూడు శాతం పెరిగితే అది 45 శాతమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఫించనర్లకు ప్రస్తుతం 42 శాతం మాత్రమే డీఏ ఉంది. మరో 4 శాతం పెరుగుతుందని ఉద్యోగులు భావించారు.
7th Pay Commission : 42 శాతం నుంచి 45 శాతం వరకే పెరగనుందా?
కానీ.. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే డీఏ అంత శాతం పెరిగే అవకాశం లేదు. అందుకే 3 శాతం పెంచి 45 శాతం డీఏను పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏడో వేతన సంఘం కూడా 3 శాతమే ఈసారి డీఏ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈసారి మూడు శాతమే డీఏ పెరిగినా కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగానే పెరగనున్నాయి.