Nellore.. మట్టి గణపతులనే ప్రతిష్టించాలని సైకత శిల్పి పిలుపు
వినాయక చవితి సందర్భంగా వేడుకలు అంబరాన్ని అంటనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా మట్టి గణేశ్ విగ్రహాలనే ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని నెల్లూరు జిల్లాకు చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ పిలుపు నిచ్చారు. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో వినాయక సైకత శిల్పాన్ని రూపొందించారు. ఆ శిల్పంపై ‘మట్టి గణపతులనే పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అని రాశాడు. కాగా, ప్రజలకు మట్టి గణేశ్ ప్రత్యేకతను వివరించేందుకుగాను సనత్ పిలుపునివ్వడం చూసి స్థానికులు అతడిని అభినందిస్తున్నారు. ఇకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పర్యావరణం బాగా దెబ్బతింటున్నది.
ఈ క్రమంలోనే ప్రతీ ఒక్కరు మట్టి గణేశ్‌లను పూజించాలని పర్యావరణ వేత్తలు సైతం సూచిస్తున్నారు. జనాల్లో మట్టి గణేశ్ పూజించడం పట్ల అవగాహన పెరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు మట్టి గణపతుల పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం సైతం మట్టి గణపతులనే వాడాలని ప్రజలకు సూచించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.