Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :18 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pregnant Women : నేరేడు పండ్లను... గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది...?

Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం చివర్లో,వర్షాకాలం ప్రారంభంలో ఎక్కువగా లభిస్తాయి. ఇవి మార్కెట్లో ఎంతో ఖరీదైనవీ. పండ్లు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగాను ఉంటాయి. అంతే, రుచి కూడా ఉంటుంది. ఈ నేరేడు పండ్లు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు నిపుణులు. ఈ నేరేడు పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్,ఫైబర్, మెగ్నీషియం,పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. మరి ఈ నేరేడు పండును గర్భిణీ స్త్రీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా…

Pregnant Women నేరేడు పండ్లను గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది

Pregnant Women : నేరేడు పండ్లను… గర్భిణీ స్త్రీలు తిన్నారంటే ఇదే జరుగుతుంది…?

Pregnant Women నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ నియంత్రణ : ఏడుకొండలు ముఖ్యంగా, డయాబెటిస్ పేషెంట్లు రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రించుటకు సహకరిస్తుంది. వీటిలో జంబోలిన్ అనే గ్లైకోసైడ్ శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియ మెరుగుపడడం : నేరేడు పండులో అధికంగా ఫైబరు ఉండడం చేత, జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెంపు: విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు, రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి.

రక్త హీనత నివారణ : ఈ నేరేడు పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కావున, రక్తహీనతతో బాధపడే వారికి ఈ నేరేడు పండు సహకరిస్తుంది.

గుండె ఆరోగ్యం : నేరేడు పండులో పొటాషియం ఉండడం చేత రక్తపోటు నియంత్రించబడుతుంది.అలాగే, గుండె సమస్యలను కూడా తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మ సౌందర్యం : ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత, చర్మాన్ని ఆరోగ్యంగానూ, కాంతివంతంగాను ఉంచుటకు సహకరిస్తుంది.

గర్భిణీ స్త్రీలు నేరేడు పండును తినవచ్చా : సాధారణంగా గర్భిణీ స్త్రీలు నేరేడు పండ్లను మితంగా తీసుకోవచ్చు. వీటిలో పోషకాలు తల్లికి బిడ్డకు మేలు చేస్తాయి ముఖ్యంగా ఐరన్, విటమిన్ సి, గర్భాదారణ సమయంలో చాలా అవసరం. అయితే,ఏ ఆహార పదార్ధమైన అతిగా తినకూడదు. గర్భాధారణ సమయంలో ఏవైనా కొత్త ఆహారాలు తీసుకునే ముందు లేదా ఏదైనా సందేహాలు ఉంటే, మీ వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. కొంతమందికి నేరేడు పండ్లు తింటే, స్వల్పంగా కడుపునొప్పి లేదా అసౌకర్యం కలగవచ్చు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది