Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. కొండెక్కుతోన్న బంగారం ధరలు.. నేటి ధ‌ర‌లు ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. కొండెక్కుతోన్న బంగారం ధరలు.. నేటి ధ‌ర‌లు ఇవే..!

Today Gold Rates : బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే గత మూడు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల నమోదు అవుతోంది. అయితే నేడు మాత్రం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :14 February 2022,9:00 am

Today Gold Rates : బంగారం ధరలు మరోసారి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గటమో లేక స్థిరంగా ఉండటమో జరుగుతూ వచ్చింది. అయితే గత మూడు రోజులుగా పసిడి ధరల్లో పెరుగుదల నమోదు అవుతోంది. అయితే నేడు మాత్రం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46, 810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 51, 060 గా ఉంది.

ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 060 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46, 810 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51, 060 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46, 810 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51, 060 గా ఉంది.బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులలో వ కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 67, 400 గానే ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి.

2022 february 14 today gold rates in telugu states

2022 february 14 today gold rates in telugu states

నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది