Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి ధరలివే..!

Today Gold Rates : గడిచిన కొద్ది రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తూ వచ్చింది. అంతకుముందు నెల రోజుల క్రితం నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉండటమో, తగ్గటమో జరగగా… మూడు రోజులు నుంచి బంగారం ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. అయితే ఇప్పుడు వాటికి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో నేడు భారీ మార్పు కనిపిస్తోంది. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :18 February 2022,9:00 am

Today Gold Rates : గడిచిన కొద్ది రోజులుగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపిస్తూ వచ్చింది. అంతకుముందు నెల రోజుల క్రితం నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉండటమో, తగ్గటమో జరగగా… మూడు రోజులు నుంచి బంగారం ధరలు మళ్ళీ అంబరాన్ని తాకుతాయా అన్నట్లుగా రోజు రోజు పెరుగుతూ వెళ్లాయి. అయితే ఇప్పుడు వాటికి బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. క్రమంగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరల్లో నేడు భారీ మార్పు కనిపిస్తోంది. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటి లాగే నేడు కూడా తగ్గాయి. అయితే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే.. ఆభరణాల తయారీలో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర రూ.45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 50, 390 గా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 970 గా ఉంది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49, 970 గా ఉంది. ఏపీ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45, 800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49, 970 గా ఉంది.

2022 february 18 today gold rates in telugu states

2022 february 18 today gold rates in telugu states

బంగారం ధరలు ఇలా ఉండగా నేడు వెండి ధరల్లో భారీ తేడాలు చోటు చేసుకున్నాయి. దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు చెన్నై, హైదరాబాదులలోనూ వెండి ధరలు భారీగా.. రూ. 200 వరకు తగ్గాయి. ఆయా చోట్ల కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 68, 000 గా ఉంది. అయితే బులియన్ మార్కెట్‌లో బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. నిమిషం నిమిషానికి.. మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి. భారీ మొత్తంలో కొనాలి అనుకునే వారు.. ఆ మేరకు ఎప్పటికప్పుడు ధరలను గమనిస్తూ బంగారాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తాజాగా స్థిరంగానో లేదా కొద్ది పాటు హెచ్చు, తగ్గు ధరలను బట్టి చూస్తే వచ్చే వేసవిలో పెళ్లిళ్లు ఉన్న వారు ఇప్పుడే బంగారం కొని పెట్టుకుంటే మంచిదని అంటున్నారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది