Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌.. నేటి ధరలివే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మ‌హిళ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. స్వ‌ల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌.. నేటి ధరలివే..!

Today Gold Rates: ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతుంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. ముఖ్యంగా బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. యుద్ధం మొదలయ్యాక బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :18 March 2022,10:00 am

Today Gold Rates: ప‌సిడి ధ‌ర ప‌రుగులు పెడుతుంది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు మాత్రం పెరిగింది. వెండి ధర కూడా బంగారం దారిలోనే నడిచింది. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇతర దేశాలపై భారీగానే పడింది. ముఖ్యంగా బ్యారెల్ ధర, తులం బంగారం ధర రోజురోజుకూ పెరుగుతూ వచ్చాయి. యుద్ధం మొదలయ్యాక బంగారం ధరలు ఆల్‌టైమ్‌ హైకి చేరుకున్నాయి. ఓ సమయంలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 53 వేలకు పైగా వెళ్లింది. అయితే గత 3-4 రోజులుగా గోల్డ్ రేట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు మాత్రం స్వల్పంగా పెరిగాయి.

శుక్రవారం (మార్చి18)న దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇక దేశీయంగా 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా స్వల్పంగా అంటే రూ.150 నుంచి రూ.200 వరకు పెరిగింది. అయితే ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఇక వెండి ధర కూడా పెరిగింది. ఇక దేశీయంగా కిలో వెండిపై రూ.1100కుపైగా పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,760 గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 మేర పెరిగింది. మరోవైపు వెండి ధరలు రూ. 2100 మేర పెరిగాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ.69,000గా ఉంది.

2022 march 18 today gold rates in telugu states

2022 march 18 today gold rates in telugu states

Today Gold Rates : ధ‌ర‌లు పైపైకి..

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది. వాణిజ్య నగరం ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,140గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,510 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,450.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ.47,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.51,760గా ఉంది.

 

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది