Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :27 May 2022,9:00 am

Today Gold Rates : ఓవైపు బంగారానికి పెరుగుతున్న డిమాండ్.. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితులు.. బంగారం ధరను రోజురోజుకూ పెంచేస్తున్నాయి. పెట్రోల్ ధరలు పెరిగినట్టుగా బంగారం ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. బంగారం ముడి సరుకు ధరలు పెరగడంతో పాటు.. బంగారం వినియోగం కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. దాని కారణం వల్ల.. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. బంగారం మాత్రమే కాదు.. వెండిని కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. తులం బంగారం కొనాలంటే 50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మధ్య బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు తగ్గాయి. మొన్న, నిన్న బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇవాళ మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గి మహిళలకు గుడ్ న్యూస్ అందించాయి.

24 april 2022 today gold rates in telugu states

24 april 2022 today gold rates in telugu states

దేశవ్యాప్తంగా ఇవాళ బంగారం ధరలు ఎలా ఉన్నయంటే.. 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4765 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.25 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.47,650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.250 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.5198 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.27 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.51,980 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.270 తగ్గింది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ వ్యాప్తంగా మెట్రో నగరాలు అయిన చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,650 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,980 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఒక గ్రాముకు ఇవాళ రూ.61.50 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 50 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.615 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5 తగ్గింది. కిలో వెండి ధర రూ.61500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది