Neelam Sahni : చిక్కుల్లో ఏపీ ఎన్నికల కమిషనర్.. జగన్ కు కొత్త తలనొప్పి.. ఆమె పదవికి గండం..?
Neelam Sahni : ఏపీకి ఎన్నికల కమిషనర్ గా ఎవరు ఉన్నా.. వాళ్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదివరకు ఏపీ సీఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆయన రిటైర్ అయిపోయారు. ఆయన స్థానంలో స్టేట్ ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్నిని నియమించారు. అయితే.. తన పదవి సమర్థతపై ఇటీవలే హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తన గురించి మాట్లాడిందో లేదో.. ఆమె నియామకమే చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీంతో.. పిటిషన్ ను విచారించిన కోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
అయితే.. హైకోర్టుకు పిటిషన్ వేసిన వాళ్లు.. గతంలో ఇటువంటి ఇష్యూపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జతపరచడంతో.. ఆ కేసుకు బలం పెరిగింది. ఎందుకంటే.. నీలం సాహ్ని.. సుప్రీంకోర్టును దిక్కరించినట్టే అవుతుందని.. ఒకవేళ అదే తేలితే.. నీలం సాహ్ని పదవి పోవడం ఖాయమని.. ఏపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ కూడా చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
Neelam Sahni : అసలు సుప్రీంకోర్టు ఉత్తర్వులో ఏముంది?
కొన్ని రోజుల కింద గోవాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు. ఆ సమయంలో రాష్ట్ర న్యాయ కార్యదర్శిగా ఉన్న వ్యక్తి.. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్ గా ఆదనపు బాధ్యతలు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే.. ప్రభుత్వంలో పనిచేసే వ్యక్తికి ఎన్నికల కమిషన్ బాధ్యతలను ఎలా అప్పగిస్తారంటూ హైకోర్టు గోవా ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. దానిపై స్టే కూడా ఇచ్చింది. అయితే.. దీనిపై గోవా ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ కేసును విచారించిన సుప్రీం కూడా అదే మాట చెప్పింది.. ఎన్నికల కమిషన్ కు సంబంధించిన వ్యవహారాల్లో ప్రభుత్వాలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నాయని హెచ్చరించింది.
ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో రాష్ట్ర కానీ.. కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదని.. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే.. ఆ ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తి అయినా సరే.. ఎన్నికల కమిషన్ లో పనిచేయకూడదు. ఎన్నికల కమిషనర్ గా ఉండే వ్యక్తి.. ఇండిపెండెంట్ గా ఉండాలి.. ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తి అయి ఉండాలి.. అని సుప్రీం స్పష్టం చేసింది.ఈ విషయం నీలం సాహ్నికి కూడా వర్తిస్తుందని.. ఆమెను ఏపీ సీఈసీగా నియమించే సమయంలో కూడా సుప్రీం మార్గదర్శకాలను గవర్నర్ కు కొందరు వెల్లడించినా కూడా ఆమె నియామకం మాత్ర ఆగలేదు. ప్రస్తుతం నీలం సాహ్ని.. సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని.. ఎలాగైనా ఆమెను సీఈసీ పదవి నుంచి తొలగించాల్సిందేనని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దీనికి ఏపీ ప్రభుత్వం ఏ విధమైన కౌంటర్ దాఖలు చేస్తుందో.. ఏం జరుగుతుందో.. నీలం సాహ్ని పదవి ఉంటుందా? పోతుందా? అనే విషయం తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.