AP Inter Exams 2025 : ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఫస్టియర్ పరీక్షలు తొలగింపు
ప్రధానాంశాలు:
AP Inter Exams 2025 : ఏపీ ఇంటర్ బోర్డ్ సంచలన నిర్ణయం.. ఫస్టియర్ పరీక్షలు తొలగింపు
AP Inter Exams 2025 : ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు AP Inter Exams 2025 సంచలనం నిర్ణయం ప్రకటించింది. ఇంటర్ విద్యలో చేపట్టిన సంస్కరణలో భాగంగా ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై నేరుగా ఇంటర్ రెండో సంవత్సరం విద్యార్థులకు మాత్రమే బోర్డ్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు…
జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్మీడియెట్ విద్యలో సంస్కరణలు చేపట్టినట్లు చెప్పారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
AP Inter Exams 2025 ఇకపై 20 ఇంటర్నల్ మార్కులు
ఇంటర్ ఫస్టియర్ సిలబస్ ఇకపై తెలుగుతో పాటు ఇంగ్లీషులో ఉంటుంది. ఇంటర్మీడియట్ లో ప్రతి సబ్జెక్టుకు ఇక నుంచి 20 ఇంటర్నల్ మార్కులుంటాయన్నారు. ఈ నెల 26 వరకు వెబ్ సైట్ లో తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు ఎవరైనా తమ అభిప్రాయం చెప్పచ్చొన్నారు. సంస్కరణలకు సంబంధించి తాము ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు చెప్పారు. సబ్జెక్టు నిపుణుల కమిటి సిలబస్ పై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. Inter-first year exams, AP, AP Inter Exams 2025