Bamboo Shoots Curry : వెదురు కొమ్మలతో మసాలా కర్రీ… రైస్, రోటిలోకి సూపర్ గా ఉంటుంది…!
Bamboo Shoots Curry : వర్షాకాలంలో అప్పుడే మొలకెత్తిన లేత వెదురు కొమ్మలతో మసాలా కర్రీ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. కొండ ప్రాంతాలలో, కొన్ని నార్త్ ఇండియా రాష్ట్రాలలో రైస్, రోటిలో నంచుకొని తినడానికి తయారు చేసుకునే మసాలా కర్రీ కోసం లేత వెదురు కొమ్మలను తీసుకొని వీటి పైన ఉండే తొక్కలను తీసివేయాలి. కడుపులో దగ్గర ఉండే దాన్ని తీసేసి మెత్తగా ఉండే భాగాన్నే తీసుకోవాలి. లేతగా ఉండే వెదురు మాత్రమే దీనికి ఉపయోగిస్తారు. ముళ్ళతో ఉండే వెదురు తినడానికి పనికిరాదు. కేవలం అడవిలో దొరికే వెదురు మాత్రమే తినటానికి వాడుతారు. ఇవి ఆన్లైన్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అయితే ఇప్పుడు వెదురు మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) లేత వెదురు 2) ఉల్లిపాయలు 3) పచ్చిమిర్చి 4) టమాట 5) ఉప్పు 6) పసుపు 7) కారం 8) ధనియాల పొడి 9) గరం మసాలా 10) జీలకర్ర 11) ఆయిల్ 12) పెరుగు 13) అల్లం వెల్లుల్లి పేస్ట్ లేతగా మెత్తగా ఉన్న వెదురుని తీసుకొని గ్రేటర్ తో సన్నగా తురుముకోవాలి. ఈ తురుమును ఒక గిన్నెలోకి తీసుకొని ఒక స్పూన్ ఉప్పు, పావు కప్పు పెరుగు వేసి బాగా పిసికి మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మూత తీసి బాగా కలిపి నీళ్లు పోసి బాగా కడిగి గట్టిగా పిండి, నీళ్లు పోసి పెట్టుకున్న మరొక గిన్నెలో మరొకసారి బాగా కడగాలి. నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూడు స్పూన్ల ఆయిల్ వేసి, అర స్పూన్ జీలకర్ర వేసి వేగాక కడిగి పెట్టుకున్న వెదురు తురుమును కూడా వేసి పచ్చిదనం పోయేవరకు వేయించుకోవాలి.
రంగు మారిన తర్వాత సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించుకొని రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి కడాయి మధ్యలో కొద్దిగా ఖాళీ చేసి సన్నగా తరిగిన టమాట ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, వేయించిన ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా రెండు నిమిషాల పాటు వేయించి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేసి మంటను లో ఫ్లేమ్ లో ఉంచి పది, పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెదురు మసాలా కర్రీ రైస్ రెడీ. దీనిని రైస్, రోటిలోకి తింటే సూపర్ గా ఉంటుంది.