EMI : ఈఎంఐ కట్టలేని వారికి బంపర్ ఆఫర్… ప్రతి నెల లోన్ పొందవచ్చు…
EMI : ప్రతి నెల ఈఎంఐ చెల్లించాలంటే కొందరికి కష్టమవుతుంది. అలాంటి వారికి ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే చాలా రిలీఫ్ పొందవచ్చు. లోన్ సెటిల్మెంట్ చేసుకోవాలంటే ముందుగా బ్యాంకు ను సంప్రదించాలి. లోన్ సెటిల్మెంట్ కోసం బ్యాంక్ అధికారులకు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. మీ రిక్వెస్ట్ ను బ్యాంక్ ఓకే చేస్తే మీకు సెటిల్మెంట్ ఆప్షన్ లభిస్తుంది. అయితే దీనికి మీరు బలమైన కారణాలు తెలియపరచాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంక్ వన్ టైం సెటిల్మెంట్ ఆప్షన్ ఇస్తుంది. లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం రికవరీ ఏజెన్సీల నెలవారి ఈఎంఐ టెన్షన్ లు ఉండవు. బ్యాంక్ రూల్స్ ప్రకారం నిర్ణీత గడువులోగా సెటిల్మెంట్ మొత్తాన్ని చెల్లిస్తే సరిపోతుంది.
అయితే లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. అడ్వాంటేజ్ తో పాటు ఇబ్బంది కూడా ఉంటుంది. లోన్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల అప్పటికప్పుడు సమస్యలు తీరుతాయి. కానీ భవిష్యత్తులో కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. లోన్ సెటిల్మెంట్ లోన్ క్లోజర్ గా బ్యాంకులో పరిగణించవని నిపుణులు చెబుతున్నారు. లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే మీ ప్రొఫైల్లో బ్యాంక్ సిబిల్ కు చేరవేస్తుంది. అప్పుడు సిబిల్ కు మీ వద్ద లోన్ చెల్లించడానికి కావాల్సిన డబ్బులు లేవని తెలుస్తుంది. దీంతో సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. సిబిల్ స్కోర్ 75 నుంచి 100 వరకు తగ్గొచ్చు. లోన్ పొందినవారు ఎకౌంట్ లు సెటిల్ చేసుకుంటే అప్పుడు క్రెడిట్ స్కోర్ మరింత ఎక్కువగా పడిపోయే అవకాశం ఉంటుంది.
లోన్ సెటిల్మెంట్ చేసుకుంటే క్రెడిట్ రిపోర్ట్ లో ఏడేళ్ల వరకు ఉంటుందని గుర్తుంచుకోవాలి. అంటే రుణ గ్రహీతలు లోన్ సెటిల్మెంట్ తర్వాత కొత్త రుణం పొందటానికి అవకాశం ఉండదు. ఏడేళ్ల వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చు. బ్యాంకులు మిమ్మల్ని బ్లాక్ లిస్టులో పెట్టేస్తాయి. లోన్ పొందడం కష్టమవుతుంది. అందువలన ఎలాంటి ఆప్షన్ లేకపోతే చివరిగా లోన్ సెటిల్మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఒకవేళ బ్యాంక్ సెటిల్మెంట్ చేసుకుంటే డబ్బులు ఉన్నప్పుడు వెంటనే బ్యాంకుకు వెళ్లి లోన్ బకాయిలను తీర్చేయాలి. తర్వాత నో డ్యూ సర్టిఫికెట్ పొందడం మర్చిపోవద్దు. తర్వాత మీకు క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతూ రావచ్చు. సెటిల్మెంట్కు ఇంకా చాలాకాలం ఉంది కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. వీలైనంత త్వరగా లోన్ తీర్చడానికి ప్రయత్నించాలి.