Black Cardamom : నల్ల యాలకుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Black Cardamom : నల్ల యాలకులు తెలుసు కదా. మామూలుగా మనం వాడేది వేరే యాలకులు. కానీ.. యాలకుల్లో రకాలు ఉంటాయి. మనం నిత్యం వాడే యాలకుల కన్నా కూడా నల్ల యాలకులను ఎక్కువగా వాడాలి. నిజానికి నల్ల యాలకులను మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. వీటిని ఎక్కువగా పులావ్, బిర్యానీ, భగారా లాంటి ఆహార పదార్థాల్లో వాడుతారు. వీటిని సువాసన కోసం రుచి కోసం ఎక్కువగా బిర్యానీ లాంటి వంటకాల్లో వాడుతుంటారు. అయితే.. మనకు కేవలం నల్ల యాలకులు సువాసన కోసం రుచి కోసమే వాడుతారని తెలుసు. కానీ.. నల్ల యాలకుల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల యాలకుల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
నల్ల యాలకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాటిని ఔషధంగా ఉపయోగిస్తారు. చాలా ఆయుర్వేద మందుల్లో నల్ల యాలకులను వాడుతారు. నల్ల యాలకుల వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి. వీటిని నిత్యం తీసుకోవాలి. రోజూ వండుకునే ఆహారంలో నల్ల యాలకులను వాడితే ఎంతో మంచిది.
Black Cardamom : అందమైన చర్మం కోసం నల్ల యాలకులను తీసుకోవాల్సిందే
నల్ల యాలకుల వల్ల చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మం నిగనిగలాడుతుంది. అందుకే.. నల్ల యాలకులను ఎక్కువగా బ్యూటీ ప్రాడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తుంటారు. నల్ల మిరియాలలో ఉన్న కార్మినేటివ్ అనే పదార్థం కడుపులో ఉన్న గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. బాగా ఆకలి వేయకున్నా.. నల్ల యాలకులను తీసుకుంటే చాలు.. ఆకలి దంచేస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది.
చాలామందికి నోటి నుంచి చెడు వాసన వస్తుంటుంది. అటువంటి వాళ్లు నల్ల యాలకులను తింటే చాలు. దాంట్లో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు.. చెడు వాసనను పోగొడతాయి. చాలామందికి శరీరంలో ఆమ్లత్వం సమస్య వస్తుంది. దాని వల్ల్.. అనేక వ్యాధులు వస్తాయి. ఆ సమస్య పోవాలంటే.. నల్ల యాలకులను తినాల్సిందే.
ఉబ్బసం ఉన్నా.. శ్వాస సంబంధ సమస్యలు ఉన్నా.. దగ్గు, జలుబు, వేడి ఉన్నా.. నల్ల యాలకులే బెస్ట్ మందు. నల్ల యాలకుల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ సీ రక్త ప్రసరణను మెరుగు పరుస్తాయి.
ఇది కూడా చదవండి ==> Diabetes : ఎన్నేళ్ల నుంచి షుగర్ ఉన్నా.. ఈ ఆకులను నమలండి.. షుగర్ వెంటనే కంట్రోల్ అవుతుంది..!
ఇది కూడా చదవండి ==> గడ్డం పెంచుకుంటే ఇన్ని లాభాలా? ఈ విషయం తెలిస్తే మీరు కూడా గడ్డం పెంచుకుంటారు?
ఇది కూడా చదవండి ==> మీకు బట్టతల ఉందా? ఈ పని చేశారంటే మీరు వద్దన్నా కూడా తలపై జుట్టు మొలుస్తుంది..!
ఇది కూడా చదవండి ==> తొక్కే కదా అని తీసేస్తే మీకే నష్టం.. అరటి తొక్క వల్ల కలిగే లాభాలు ఇప్పుడే తెలుసుకోండి..!