Banana Peel : తొక్కే కదా అని తీసేస్తే మీకే నష్టం.. అరటి తొక్క వల్ల కలిగే లాభాలు ఇప్పుడే తెలుసుకోండి..!
Banana Peel : అరటి పండు తెలుసు కదా. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటి పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రోజుకో అరటి పండు తింటే చాలా మంచిది. అయితే.. అరటి పండును తినేటప్పుడు ముందు దానికి ఉన్న తొక్కను తీసేసి పండును మాత్రం తింటారు. చిన్న పిల్లలైనా.. పెద్దలైనా ఎవ్వరైనా సరే.. చేసేది అదే. అరటి పండును తిని.. తొక్కను ఎక్కడో చెత్తలో పడేస్తాం. తొక్కను ఎవ్వరూ తినరు. కానీ.. మనం తినకుండా పడేసే తొక్కలోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో లాభాలు ఉన్నాయి. అది చాలామందికి తెలియదు.
అరటి తొక్కే కదా అని చాలా ఛీప్ గా చూస్తాం. తొక్కను బయటపడేస్తాం. కానీ.. ఆ తొక్క వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం నోరెళ్లబెట్టడం తప్పించి చేసేదేం ఉండదు. ఇన్ని రోజులు.. అవసరం ఉన్నదాన్ని పక్కన చెత్తబుట్టలో పడేశామా? అని అనుకుంటాం.
Banana Peel : అరటి పండుతో పాటు తొక్కను కూడా తినొచ్చు
అరటి పండుతో పాటు తొక్కను కూడా తినొచ్చు. దాంట్లో ఎన్నో విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. అరటి తొక్కలతో వంటకాలు కూడా చేస్తారు. ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో అరటి తొక్కను వేస్తారు. అలాగే.. దంతాలు పచ్చగా ఉన్నవాళ్లు.. అరటి తొక్కను తీసుకొని దంతాలపై రుద్దాలి. దీంతో దంతాలు తెల్లగా మెరుస్తాయి. చాలామందికి మొటిమలు వస్తుంటాయి. వాటి వల్ల చాలా బాధపడుతుంటారు. మొటిమలు రాకుండా ఉండాలన్నా.. వచ్చిన మొటిమలు పోవాలన్నా.. అరటి తొక్కను మొటిమలు ఉన్న దగ్గర రుద్దాలి. అప్పుడు మొటిమలు మటుమాయం అవుతాయి.
సాధారణంగా నొప్పి లేవడం అనేది చూస్తూనే ఉంటాం. నడుము నొప్పి లేదా చేతుల్లో నొప్పులు.. కాళ్ల నొప్పులు.. ఇలా చాలా రకాల నొప్పులను మనం చూస్తూనే ఉంటాం. అటువంటి నొప్పులు ఉన్నప్పుడు అక్కడ అరటి తొక్కను తీసుకొని రుద్దాలి. దాన్న అలాగే.. ఓ అరగంట పాటు నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే ఏనొప్పి అయినా సరే.. తగ్గిపోతుంది. లేదంటే.. అరటి తొక్కను తీసుకొని.. దానికి వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేసి దాని మిశ్రమాన్ని నొప్పి నివారణ కోసం ఉపయోగించవచ్చు.
సోరియాసిస్ ఉన్నవాళ్లు అరటి తొక్కను తీసుకొని దాన్ని ఆ ప్రాంతంలో రుద్దితే సోరియాసిస్ తగ్గడంతో పాటు.. దాని వల్ల ఏర్పడే దురద కూడా తగ్గిపోతుంది. ఏవైనా కీటకాలు శరీరాన్ని కుట్టినా.. ఆ నొప్పి నుంచి తగ్గించడానికి అరటి తొక్కను ఉపయోగించవచ్చు. ఇలా.. పలు రకాలుగా అరటి తొక్క ఉపయోగపడుతుంది. ఈసారి అరటి తొక్కను మాత్రం వేస్ట్ చేయకండి. అరటి పండుతో పాటు.. దాన్ని కూడా ఉపయోగించుకోండి.
ఇది కూడా చదవండి ==> మీ శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్క చెంచా దీన్ని తినండి.. అంతే రోగాలన్నీ పరార్..!
ఇది కూడా చదవండి ==> కాకర కాయలతో తయారు చేసిన టీ తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో మీకు తెలుసా…?
ఇది కూడా చదవండి ==> తెల్ల జుట్టు వేధిస్తోందా? ఈ చిట్కాలు పాటిస్తే.. మీ జుట్టు వెంటనే నల్లగా మారుతుంది..!
ఇది కూడా చదవండి ==> ఈ మొక్క వేర్లలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు?