Byreddy Siddharth Reddy : పబ్లిక్ మీటింగ్ లో ఫోన్ లో మాస్ వార్నింగ్ ఇచ్చిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీడియో వైరల్..!!
Byreddy Siddharth Reddy : వైసీపీ పార్టీలో యువనేతల్లో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. రాయలసీమ ప్రాంతానికి చెందిన బైరెడ్డి… రాష్ట్ర వైసీపీ యువజన విభాగానికి అధ్యక్షుడిగా ఉంటూ మరోపక్క శాప్ చైర్మన్ పదవిలో అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సినిమా హీరోలకు ఉండే క్రేజ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఉంది. కర్నూలు జిల్లా నందిగామ నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన బైరెడ్డి… జగన్ నాయకత్వం బలపరచడంలో.. తనదైన శైలిలో రాజకీయ స్పీచ్ ఇవ్వటంలో దిట్ట. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే వ్యక్తిత్వం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొంతం. అత్యర్థులకు దీటైన కౌంటర్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వైఎస్ జగన్ విషయంలో ఇంకా వైసీపీ పార్టీ విషయంలో ఎవరైనా అతిగా స్పందిస్తే..
మర్చిపోలేని రీతిలో బైరెడ్డి స్పీచ్ కౌంటర్ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా. ..వైసీపీ వర్సెస్ బీజేపీ నాయకుల మధ్య గొడవ జరగగా దానికి సంబంధించి సెటిల్మెంట్…. ఫోన్ లో మాట్లాడుతూ బైరెడ్డి డీల్ చేసిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి గొడవ మొత్తం వివరించి వైసీపీ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండించడం జరిగింది.