KCR : అది కేసీఆర్ అంటే? చివరకు తన పంతాన్నే నెగ్గించుకున్నారు? కేంద్రం దిగిరాక తప్పలేదు?
KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి తెలిసిందే కదా. ఆయన పట్టువదలని విక్రమార్కుడు. ఏదైనా పని చేయాలంటే ఆరు నూరు అయినా.. ఎన్ని అడ్డంకులు వచ్చినా చేసి తీరుతారు. కొన్ని విషయాల్లో ఆయన మొండి పట్టు పడతారు. అందుకే ఆయన ఇక్కడి వరకు రాగలిగారు. తెలంగాణ సాధించే విషయంలోనూ ఆయన పట్టిన పట్టే తెలంగాణ సాకారం అయ్యేలా చేసింది. అయితే… తాజాగా సీఎం కేసీఆర్ కల నెరవేరింది. ఆయన తెలంగాణలో ఏదైతే వ్యవస్థ ఉండాలనుకున్నారో ఆ వ్యవస్థకు ఎట్టకేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం రాకముందు… ఉమ్మడి ఏపీలో జోన్ల వ్యవస్థ ఉండేది. అంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం జోన్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేవాళ్లు. అన్ని జిల్లాల నిరుద్యోగులకు సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం… ఉమ్మడి ఏపీలో జోన్లను ఏర్పాటు చేసింది. మొత్తం ఆరు జోన్లు ఉండగా… అందుకే 5, 6 జోన్లు మాత్రం తెలంగాణకు చెందినవి.. మిగితా 4 జోన్లు ఏపీలో ఉండేవి.
అయితే… ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. తెలంగాణ సపరేట్ రాష్ట్రం కావడంతో కేవలం రెండు జోన్లు ఉండటం వల్ల అన్ని ప్రాంతాల తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాల విషయం సమన్యాయం జరగడం లేదని గ్రహించిన సీఎం కేసీఆర్… తెలంగాణలో కొత్త జోన్ల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆయన కొత్త జోన్లుగా విభజిస్తూ చాలా ఏళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నారు. కానీ… జోన్ల వ్యవస్థకు కేంద్రం నుంచి ఆమోద ముద్ర ఉండాలి. కానీ.. కేంద్రం అప్పటి నుంచి జోన్ల వ్యవస్థ ఫైలును పక్కన పెట్టింది. చివరకు తాజాగా… కొత్త జోన్లకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది. కేంద్రం హోంశాఖ జోన్ల వ్యవస్థపై గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
KCR : మూడేళ్ల తర్వాత జోన్ల వ్యవస్థకు మోక్షం
మూడేళ్ల కిందనే కేసీఆర్ కొత్త జోన్ల వ్యవస్థను రూపొందించారు. తాజాగా…. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ 2018 కి ఆమోదముద్ర వేశారు. ఈ కొత్త జోన్ల వ్యవస్థ పోలీస్ రిక్రూట్ మెంట్ కు కాకుండా… మిగితా అన్ని డిపార్ట్ మెంట్ల ఉద్యోగాలకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు కొత్త జోనల్ వ్యవస్థతో నియామకాలు జరగలేదు. భవిష్యత్తులో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు కొత్త జోనల్ విధానం ద్వారా భర్తీ జరిగే అవకాశం ఉంది.