Chettinad Chicken Curry : చెట్టినాడు చికెన్ మసాలా కర్రీ ..ఈ విధంగా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది…
Chettinad Chicken Curry : తమిళనాడు సైడ్ నాన్ వెజ్ ను వెరైటీగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా కారం వాడకుండా నాన్ వెజ్ ను ఎంతో టేస్టీగా చేస్తూ ఉంటారు. అలాంటిదే ఇప్పుడు మనం తమిళనాడు చిట్టినాడు చికెన్ మసాలా కర్రీ చేసుకోబోతున్నాం.. కావాల్సిన పదార్థాలు : చికెన్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ,మిరియాలు ,ధనియాలు, ఎండు కొబ్బరి, కారం, సోంపు, బిర్యానీ ఆకు, జీలకర్ర, బండ పువ్వు, లవంగాలు, యాలకులు ,జాపత్రి, దాల్చిన చెక్క, స్టార్, అనాసపువ్వు, అలాగే ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాట ముక్కలు, కొత్తిమీర మొదలైనవి..
తయారీ విధానం : ముందుగా చికెన్ ని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ధనియాలు, నాలుగు స్పూన్ల మిరియాలు, కొంచెం సోంపు, కొంచెం జీలకర్ర ,నాలుగు యాలకులు, నాలుగు లవంగాలు, ఒక దాల్చిన చెక్క అనాసపువ్వు, స్టార్, జాపత్రి బండ పువ్వు, ఎండు కొబ్బరి ముక్కలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోని దానిని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి పేస్టులా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇక తర్వాత స్టౌ పై ఒక కడాయి పెట్టి దానిలో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసి దానిలో కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి ,ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి.
దాంట్లో కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు టమాట ముక్కలు కూడా వేసి మెత్తబడే వరకు వేయించుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి బాగా కలిపి ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి దాంట్లో రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇక తర్వాత దానిలో ఒక కప్పు నీటిని వేసి, కుక్కర్ కి మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడకనిచ్చి తర్వాత తీసి దానిపైన కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ గా చెట్టి నాడి చికెన్ మసాలా కర్రీ రెడీ..