Revanth Reddy : అవన్నీ మరిచిపోదాం అన్న రేవంత్ రెడ్డి.. బాలీవుడ్, హలీవుడ్ మన గడ్డమీదుండాలి అంటూ కామెంట్
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు పూర్తిగా తోడ్పాటునందిస్తామని ప్రకటించారు. శనివారం రాత్రి హైటెక్స్‌లో జరిగిన ‘తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు’ కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కఠినంగా ఉండవచ్చు, కొన్ని నిర్ణయాలతో మిమ్మల్ని ఆశ్చర్యపరిచినా… మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది అని చెప్పారు.
Revanth Reddy : రేవంత్ సపోర్ట్..
మీ అభివృద్ధికి కోసం నూటికి నూరు శాతం తోడ్పాటునందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం” అని పేర్కొన్నారు. మిమ్మల్ని అభినందించడానికి, తగిన గౌరవం కల్పించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నంది అవార్డులను ‘తెలంగాణ గద్దర్ అవార్డులు’గా మార్చి అందజేస్తున్నందున ఇది సినీ రంగానికి కొరత తీరుస్తుందని వివరించారు.

Revanth Reddy : అవన్నీ మరిచిపోదాం అన్న రేవంత్ రెడ్డి.. బాలీవుడ్, హలీవుడ్ మన గడ్డమీదుండాలి అంటూ కామెంట్
అమెరికాకు హాలీవుడ్, ముంబైకి బాలీవుడ్ ..మన హైదరాబాద్‌కు తెలుగు సినిమా కేంద్రంగా ఉండాలని తపన. ఆ దిశగా ప్రభుత్వం పూర్తిగా తోడ్పడుతుంది అని సీఎం తెలిపారు. అలానే ఈ ఈవెంట్లో రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఆప్యాయంగా పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.