Food : అన్నం తినగానే టీ, కాఫీలు తాగుతున్నారా.. ముందు ఇది చదవండి మీకోసమే…!
టీ, కాఫీలు తాగడం అలవాటు లేనివాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్లు, ఇతర బిజినెస్ లు చేసేవాళ్లు ఎక్కువగా టీకాఫీలను తాగుతుంటారు. ఇంట్లో ఉన్నప్పుడు కూడా రోజూ ఉదయం, సాయంత్రం ఓ కప్పు టీ కానీ.. చాయ్ కానీ తాగాల్సిందే. లేకపోతే ఆరోజు సరిగ్గా గడవదు. టీ కాఫీలు మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. పొద్దున లేవగానే ఓ టీ కడుపులో పడాల్సిందే. అప్పుడే నిద్ర గిద్ర అంతా మాయం అవుతుంది. అయితే.. టీ, కాఫీలను మోతాదులో తీసుకుంటే పెద్దగా వాటి వల్ల వచ్చిన నష్టమేమీ లేదు కానీ.. అతిగా తాగకూడదు. రోజూ ఓ కప్పు, రెండు కప్పులు ఓకే కానీ.. అస్తమానం టీకాపీలు తాగితే మాత్రం లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అది సరే కానీ.. కొందరైతే టీ కాఫీలను ఎప్పుడు పడితే అప్పుడు తాగుతుంటారు. దానికి ఒక టైమ్ ఉండదు పాడు ఉండదు. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడే తాగేస్తుంటారు. అలా టీకాఫీలను ఎప్పుడు పడితే అప్పుడు తాగినా కూడా లేనిపోని సమస్యలు వస్తాయట. చాలామంది టీకాఫీలను ఎక్కువగా భోజనం చేశాక అంటే మధ్యాహ్నం పూట భోజనం చేశాక వెంటనే టీ కాఫీలను తాగుతున్నారట. ఉదయం పూట టిఫిన్స్ చేశాక మనకు టీ కాఫీలను తాగడం అలవాటు. అలాగే.. మధ్యాహ్నం అన్నం తిన్నాక కూడా చాలామంది అలాగే టీ కాఫీలను తాగేస్తున్నారట. అన్నం తిన్న వెంటనే టీ కాఫీలను తాగడం అస్సలు మంచిది కాదు. వెంటనే టీ కాఫీలను తాగేస్తే.. మనం తిన్న ఆహారంలో ఉండే ఐరన్ ను శరీరం గ్రహించలేదు. అందుకే.. చాలామంది ఐరన్ సమస్య వస్తుంది. ఎందుకంటే.. శరీరానికి కావాల్సిన ఐరన్.. మనం తినే తిండి నుంచే వస్తుంది. ఆ తిండి తినగానే.. కాఫీలు, టీలు తాగితే.. ఐరన్ ను శరీరం గ్రహించుకోలేదు. దీంతో ఐరన్ లోపం రావడం, రక్త హీనత రావడం లాంటి సమస్యలు చోటు చేసుకుంటాయి.
భోజనం చేయగానే టీ, కాఫీలు తాగాలనిపిస్తే ఏం చేయాలి మరి?
చాలామందికి భోజనం చేయగానే ఏదో ఒకటి తాగాలనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే.. వేడి వేడిగా చాయ్, కాఫీ తాగుతారు. అటువంటి వాళ్లు.. ఏవైనా పండ్లరసాలను తాగండి. ముఖ్యంగా విటమిన్ సీ ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోండి. అప్పుడు శరీరం ఐరన్ ను బాగా గ్రహించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖచ్చితంగా భోం చేశాక టీ, కాఫీలు తాగాలంటే మాత్రం కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి. అన్నం తిన్న తర్వాత రెండు గంటలు గ్యాప్ ఇచ్చి అప్పుడు టీ, కాఫీలను తాగాలి. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా అన్నం తినగానే టీ, కాఫీలను తాగడం మాత్రం మానేయాల్సిందే. లేదంటే విటమిన్ సీ ఎక్కువగా ఉండే జ్యూస్ లను ఎక్కువగా తాగండి. దాని వల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది.. మీకు ఏదైనా తాగిన ఫీలింగ్ కూడా వస్తుంది.
ఇది కూడా చదవండి ==> Mind Diet : శరీరంలో వంద రోగాలు ఉన్నా.. ఒక్కటే డైట్.. ఇది పాటిస్తే చాలు.. రోగాలన్నీ మటాష్..!
ఇది కూడా చదవండి ==> Belly Fat : బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేస్తే మీ బొడ్డు నాజూగ్గా మారడం ఖాయం..!
ఇది కూడా చదవండి ==> Turmeric Green Tea : పసుపు గ్రీన్ టీని నిత్యం తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులు తెలిస్తే అస్సలు వదలరు..!
ఇది కూడా చదవండి ==> Mobile : నిద్ర లేవగానే మీరు వెంటనే మొబైల్ చూస్తున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..?