Farmers Protest : హింసాత్మకంగా మారిన రైతుల పోరాటం.. సాగు చట్టాలు రద్దయ్యేదెప్పుడు?
Farmers Protest : ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. కొన్ని నెలల నుంచి రైతులు ఢిల్లీ బార్డర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. అక్కడే తింటున్నారు. అక్కడే పడుకుంటున్నారు. చలికి వణుకుతూ అక్కడే నడిరోడ్డు మీద పడుకుంటున్నారు. తోటి రైతులు కొందరు చలికి తట్టుకోలేక, ఆరోగ్యం బాగాలేక చనిపోతున్నా.. ఏమాత్రం భయపడటం లేదు. కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఎంత భద్రత ఉన్నా.. పోలీసులు ఉన్నా.. తమ ఆందోళనను మాత్రం విరమించడం లేదు. కొత్త వ్యవసాయ చట్టాలను ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే. వాటిని రద్దు చేసేవరకు అక్కడి నుంచి కదిలేదు అదు అంటూ నినదిస్తున్నారు.
అయితే.. రైతుల పోరాటం కాస్త హింసాత్మకంగా మారుతోంది. రైతులు తమ ఆందోళనను ఉదృతం చేస్తున్న కొద్దీ అక్కడ పరిస్థితులు ఉదృతంగా మారుతున్నాయి.
Farmers Protest : హింసాత్మకంగా రైతుల గణతంత్ర పరేడ్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్ హింసాత్మకంగా మారింది. ఆ పరేడ్ లో పోలీసులు కూడా గాయపడ్డారు. రైతులు ట్రాక్టర్లతో పరేడ్ ను నిర్వహించారు. ట్రాక్టర్లతో డైరెక్ట్ గా ఎర్రకోటను ముట్టడించారు. అయితే.. ముందస్తుగా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్న రైతులు.. తాము ముందుగా అనుకున్న రూట్ లో కాకుండా.. ట్రాక్టర్ల పరేడ్ ను వేరే రూట్ ద్వారా నిర్వహించడంతో అక్కడ ఆందోళన చెలరేగింది. అలాగే ఓ ట్రాక్టర్ పల్టీలు కొట్టడంతో ఓ రైతు మరణించాడు.
మరోవైపు ఎర్రకోట వైపు దూసుకొచ్చిన రైతులు.. అక్కడ ఎర్రకోటపై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగరేసిన జెండాలను తొలగించారు. హర్యానా రైతులు ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో వెంటనే ఢిల్లీలో పారామిలిటరీ బలగాలను మోహరించారు.