మంత్రి పదవి నుండి తప్పిస్తారనే వార్తపై స్పందించిన జగదీష్‌రెడ్డి..!
తర్వలో మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనే వార్తపై తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి స్పందించాడు. ఈటెల రాజేందర్ కు పట్టిన గతి తనకు కలలో కూడా జరగదని మంత్రి జగదీష్ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరిక పై మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తన కుమారుడు పుట్టిన రోజు హంపి కథ ఒక ప్రిపేర్డ్ స్క్రిప్ట్ అని, ఈటేలకు పట్టిన గతే నాకు పడుతుందని కొందరు కలలు కంటున్నారని, కానీ అది ఎప్పటికి జరగదని మంత్రి జగదీష్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశాడు.
వారి కల్ల కలగానే మిగిలిపోతుంది : మంత్రి జగదీష్‌రెడ్డి
అయితే జగదీష్‌రెడ్డిని మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని ఇతర పార్టీ నాయకులు కలలు కంటున్నారని, ఈటేల రాజేందర్ ను కూడా ఇలా చేశారని మంత్రి తెలిపారు. నన్ను కేబినెట్ నుంచి ఎవరు బయటకు పంపాలని అనుకోవడం లేదని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈటేల లాగేనే మంత్రి జగదీష్‌రెడ్డిని కూడా తప్పిస్తారని ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది.
మంత్రి జగదీష్‌రెడ్డి కుమారుడు పుట్టినరోజు వేడుకలు కర్ణాటకలోని హంపిలో జరిగింది. ఆ వేడుకలు కొందరు ఎమ్మెల్యేలతో పాటు మంత్రి జగదీష్‌రెడ్డి సంభాషణలు ఆ ఆంగ్ల పత్రిక కథనం రాసింది. మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆ కథనాన్ని సోషల్ మీడియాలో పొస్ట్ చేయడం జరిగింది. ఆ ఆంగ్ల పత్రికలో ఈ కథనం రావడంతో టీఆర్ ఎస్ పార్టీలో తెగ చర్చకు దారితీసింది.