Komati Reddy : నాతో పాటు సీఎం ప‌దవికి అర్హుడు కోమ‌టి రెడ్డి మాత్ర‌మే.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Komati Reddy : నాతో పాటు సీఎం ప‌దవికి అర్హుడు కోమ‌టి రెడ్డి మాత్ర‌మే.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2024,3:37 pm

ప్రధానాంశాలు:

  •  Komati Reddy : నాతో పాటు సీఎం ప‌దవికి అర్హుడు కోమ‌టి రెడ్డి మాత్ర‌మే.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

Komati Reddy : లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతుంది. ఈ క్ర‌మంలో రేవంత్ రెడ్డి అనేక ప్రాంతాల‌లో ప‌ర్య‌టిస్తూ ఉన్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి నిజమైన పోరాటయోధుడు అంటూ రేవంత్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. తనతో పాటు ముఖ్యమంత్రి అయ్యే అన్ని అర్హతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉన్నాయ‌ని రేవంత్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. అనివార్య ప‌రిస్థితుల‌లో తాను సీఎం అయ్యాన‌ని, తెలంగాణ కోసం తెగించి, సొంత పార్టీని ధిక్కరించారంటూ కోమటిరెడ్డిని పొగిడారు.

Komati Reddy : సీఎం పదవికి కోమటిరెడ్డి మాత్రమే అర్హుడు

కేసీఆర్ తెలంగాణ కోసం న‌కిలీ ఉద్య‌మాన్ని న‌డిపించారు. కాని తెలంగాణ కోసం రాజీనామా చేసి కోమ‌టిరెడ్డి దీక్ష చేశారన్నారు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరిలో 3 లక్షల మెజార్టీ ఇవ్వాలని ఓటర్లను కోరారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు ఇచ్చినా అది మోడీ ఖాతాలోకే వెళ్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఇక రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే బాధ్యతను సీఎం రేవంత్​ రెడ్డి తీసుకున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Komati Reddy నాతో పాటు సీఎం ప‌దవికి అర్హుడు కోమ‌టి రెడ్డి మాత్ర‌మే రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

Komati Reddy : నాతో పాటు సీఎం ప‌దవికి అర్హుడు కోమ‌టి రెడ్డి మాత్ర‌మే.. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్యలు

భువనగిరిలో ఇప్పుడే ఆట మొదలైందని, తెలంగాణలో రాజకీయాలు అంటే ఏంటో ఇప్పుడు చూపిస్తామని కోమ‌టిరెడ్డి చెప్పుకొచ్చారు. జిల్లాలో 11 సీట్లు సాధించామన్న రాజగోపాల్ రెడ్డి, చిన్న తప్పిదం వల్ల సూర్యాపేట స్థానంలో ఓడిపోయామని చెప్పారు. జగదీశ్ రెడ్డి అక్రమాలను బయటకు తీస్తామన్నారు. వచ్చే ఏడాది కవిత ఎక్కడ బతుకమ్మ ఆడుతుందని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు రోజులకే కేసీఆర్ కుమారుడు సర్కారు పడిపోతుందని ప్రచారం చేయడం మొదలు పెట్టారు. కానీ అనుభవం లేని కేటీఆర్ మాటలను పక్కనపెట్టాం .. అయితే పదేళ్ల ముఖ్యమంత్రిగా పాలించిన కేసీఆర్​ సైతం ఏడాదిలో ప్రభుత్వాన్ని కూల్చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్​కు కాపలాగా ఉన్నది హైటెన్షన్​ వైర్ రేవంత్ రెడ్డి అంటూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు రేవంత్ రెడ్డి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది